వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టి సర్కారుపై నాగం: బిజెపి స్వచ్ఛ భారత్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన బుధవారం బిజెపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. 144 సెక్షన్ పెట్టి తెలంగాణలో పాలన కొనసాగించలేరని అన్నారు. ప్రతిపక్షాలను భయపెట్టి ఏమీ సాధించలేరని అన్నారు.

తెలంగాణలో కరువు పరిస్థితులు నెలకొంటే సమీక్షించేందుకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు సమయం దొరకలేదా అని ఆయన ప్రశ్నించారు. రైతుల గురించి పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలది పెద్ద పాత్ర అని చెప్పారు.

దాడిని ఖండిస్తున్నాం: బండారు

నల్గొండలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడిని ఖండిస్తున్నామని బిజెపి ఎంపి బండారు దత్తాత్రేయ అన్నారు. గత 3,4 నెలల్లో 250 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ముందుచూపుతో వ్యవహరిస్తే రైతు ఆత్మహత్యలు జరిగేవి కావని దత్తాత్రేయ పేర్కొన్నారు.

ప్రభుత్వం కరవు నివేదికలను కేంద్రానికి సకాలంలో ఇవ్వలేదని అన్నారు. రాష్ట్రానికి విద్యుత్ విషయంలో ఏపి సిఎం ఉదారంగా ఉండాలని ఆయన సూచించారు. పత్తి కొనుగోళ్లలో సిసిఐ మొక్కుబడిగా వ్యవహరిస్తోందని దత్తాత్రేయ ఆరోపించారు. జిహెచ్ఎంసిని విభజిస్తూ సిఎం కెసిఆర్ రాజకీయ నిర్ణయం తీసుకున్నారన్నారు.

స్వచ్ఛ భారత్

స్వచ్ఛ భారత్

ఉస్మానియా ఆస్పత్రిలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

స్వచ్ఛ భారత్

స్వచ్ఛ భారత్

బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పి. మురళీధరరావు, జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తత్రేయ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తోపాటు బిజెపి ఎమ్మెల్యే, నేతలు ఆస్పత్రి ఆవరణలో చెత్తను తొలగించారు.

స్వచ్ఛ భారత్

స్వచ్ఛ భారత్

బిజెపి గ్రేట్ హైదరాబాద్ నేతలు, మరో వైపు మహిళా విభాగం నాయకులు, అనుబంధ సంఘాల కార్యకర్తలు ఏకకాలంలో ఆస్పత్రి ఆవరణలో వేర్వేరు ప్రాంతాల్లో చీపుర్లు చేతపట్టి శుభ్రం చేశారు.

స్వచ్ఛ భారత్

స్వచ్ఛ భారత్

మహాత్మాగాంధీ స్ఫూర్తితో ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలంతా స్వచ్ఛందంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలని ఈ సందర్భంగా నేతలు విజ్ఞప్తి చేశారు.

బండారు దత్తాత్రేయ

బండారు దత్తాత్రేయ

నల్గొండలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడిని ఖండిస్తున్నామని బిజెపి ఎంపి బండారు దత్తాత్రేయ అన్నారు. గత 3,4 నెలల్లో 250 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ముందుచూపుతో వ్యవహరిస్తే రైతు ఆత్మహత్యలు జరిగేవి కావని దత్తాత్రేయ పేర్కొన్నారు.

నాగం జనార్ధన్ రెడ్డి

నాగం జనార్ధన్ రెడ్డి

భారతీయ జనతా పార్టీ నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 144 సెక్షన్ పెట్టి తెలంగాణలో పాలన కొనసాగించలేరని అన్నారు. ప్రతిపక్షాలను భయపెట్టి ఏమీ సాధించలేరని అన్నారు.

స్వచ్ఛ భారత్‌లో పాల్గొన్న కిషన్, దత్తాత్రేయ

ఉస్మానియా ఆస్పత్రిలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు పాల్గొన్నారు. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పి. మురళీధరరావు, జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తత్రేయ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తోపాటు బిజెపి ఎమ్మెల్యే, నేతలు ఆస్పత్రి ఆవరణలో చెత్తను తొలగించారు.

బిజెపి గ్రేట్ హైదరాబాద్ నేతలు, మరో వైపు మహిళా విభాగం నాయకులు, అనుబంధ సంఘాల కార్యకర్తలు ఏకకాలంలో ఆస్పత్రి ఆవరణలో వేర్వేరు ప్రాంతాల్లో చీపుర్లు చేతపట్టి శుభ్రం చేశారు. మహాత్మాగాంధీ స్ఫూర్తితో ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలంతా స్వచ్ఛందంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలని ఈ సందర్భంగా నేతలు విజ్ఞప్తి చేశారు.

English summary
Bharatiya Janata Party leader Nagam Janardhan Reddy on Wednesday fired at Telangana Government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X