గుప్త నిధుల పేరుతో 11 మందిని హత్య చేశాడు: ఈ నరహంతకుడు ఎలా చిక్కాడంటే?

నాగర్‌కర్నూల్: తాంత్రిక పూజల పేరుతో నిధులు సేకరిస్తానని నమ్మించి 11 మందిని దారుణంగా హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నరహంతకుడిని నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఇంద్రానగర్ కాలనీకి చెందిన రామటి సత్యనారాయణ(47) అలియాస్ సత్యం యాదవ్​‌గా గుర్తించారు. ఈ మేరకు గద్వాల జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ మీడియా సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు.

నిందితుడు రామటి సత్యనారాయణ గుప్త నిధుల పేరుతో నమ్మించి 11 మందిని కిరాతకంగా హత్య చేశాడని తెలిపారు. తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఏపీతోపాటు కర్ణాటకలోనూ ఈ హత్య చేశాడని వెల్లడించారు. నిందితుడు క్షుద్రపూజలు చేసి గుప్తనిధులు వెలికి తీస్తానని నమ్మించి అమాయకుల నుంచి తొలత డబ్బులు కాజేస్తాడు. డబ్బులు లేవంటే ఇండ్ల స్థలాలు, భూములు తన పేరుమీద రాయించుకుంటాడు. ఆ తర్వాత పూజల పేరుతో వారిని నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకువెళ్తాడు. తీర్ధం పేరుతో గుర్తుతెలియని రసాయనాలు కలిపిన విషాన్నివారిచేత తాగిస్తాడు.

Nagar kurnool police arrested the accused, who killed 11 people on the pretext of hidden treasures

బాధితులు అపస్మారక స్థితికి వెళ్లాక వారిపై యాసిడ్ పోసి లేదంటే బండరాళ్లు మోది హత్య చేస్తాడు. అలా 2020 నుంచి ఇప్పటి వరకూ మహిళలు సహా 11మందిని హతమార్చినట్లు డీఐజీ వెల్లడించారు. నిందితుని నుంచి హత్యకు గురైన వ్యక్తులకు చెందిన 5 సెల్ ఫోన్లు, నిందితుడు వినియోగించిన 8 సెల్ ఫోన్లు,10 సిమ్ కార్డులు, ఓ కారు, విష రసాయానాలున్న డబ్బాలు, ఎలక్ట్రికల్ డిటోనేటర్లనుస్వాధీనం చేసుకున్నట్లు డీఐజీ వెల్లడించారు.

2020 నుంచి హత్యలు చేస్తున్న నిందితుడు చివరకు ఓ వ్యక్తి అదృశ్యం కేసు దర్యాప్తులో పోలీసుల చేతికి చిక్కాడు. హైదరాబాద్ లంగర్ హౌజ్‌​కు చెందిన గోవుల లక్ష్మి భర్త వెంకటేష్, నాగర్ కర్నూల్‌​లో సత్యంయాదవ్ కలిసి వస్తానని చెప్పి.. ఐదు రోజులుగా తిరిగి రాలేదు. దీంతో ఆమె నేరుగా నాగర్ కర్నూల్‌​కు వచ్చి సత్యనారాయణను నిలదీయగా సరైన సమాధానం ఇవ్వలేదు. అనుమానం వచ్చిన ఆమె నాగర్ కర్నూల్ పోలీసు స్టేషన్ లో వెంకటేశ్ కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు సత్యనాయరణ ప్రవర్తనపై అనుమాన పడ్డారు. ఈ క్రమంలోనే నిందితుడి నేరాల చిట్టా బయటపడింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే.. క్షుద్రపూజలు చేసి గుప్తనిధులను వెలికి తీస్తానని నిందితుడు చెప్పడంతో ఆ మాటలు నమ్మాడు వెంకటేశ్. గుప్తనిధులు వెలికి తీసేందుకు నిందితుడు సత్యనారాయణను సంప్రదించారు. డబ్బిస్తే చేస్తానని అంగీకరించిన సత్యనారయణ ఒంటరిగా వస్తేనే చేస్తానని వెంకటేశ్‌​కు షరతు విధించాడు. అందుకు వెంకటేశ్ సహా అతని స్నేహితులు అంగీకరించారు. గుప్తనిధుల్ని కనిపెట్టాలంటే తానిచ్చిన మూలికల్ని చెప్పినచోట ఉంచి రావాలని పలుమార్లు వెంకటేశ్ ను వివిధ ప్రాంతాలకు పంపి కాలం గడిపాడు.

Nagar kurnool police arrested the accused, who killed 11 people on the pretext of hidden treasures

కొంతకాలం తర్వాత నిధి దక్కాలంటే ముగ్గురు గర్భిణులను బలివ్వాలని సూచించాడు సత్యనారాయణ. దీంతో భయాందోళన గురైన వెంకటేశ్.. ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. తన బండారం బయట పడుతుందని, ఎలాగైనా అతన్ని చంపాలని నిందితుడు నిర్ణయించుకున్నాడు. మరోచోట నిధులున్నాయని వెంకటేశ్​‌ను నవంబర్ 3న నాగర్ కర్నూల్‌​కు రప్పించాడు.

4వ తేదీ ఉదయం 4 గంటలకు పరగడుపున తీర్థమని చెప్పి విషపూరిత రసాయనాలు జిల్లేడుపాలను వెంకటేశ్ చేత తాగించాడు. దీంతో వెంకటేశ్ అపస్మారస్థితికి చేరుకున్నాడు. అతన్ని జలాల్​పూర్ శివారుకు తీసుకెళ్లి దుస్తులు విప్పించి యాసిడ్ పోసి హత మార్చి తిరిగి నాగర్ కర్నూల్ చేరుకున్నాడు నిందితుడు సత్యం. ఈ క్రమంలోనే పోలీసులు నిందితుడు సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా, అంతకుముందు చేసిన 10 హత్యలను గురించి కూడా చెప్పడంతో పోలీసులు షాకయ్యారు.

వననర్తి జిల్లా రేవల్లి మండలంలో నలుగురు, నాగర్ కర్నూల్ పీఎస్ పరిధిలో ఇద్దరు, కొల్లాపూర్, కల్వకుర్తి పీఎస్ పరిధిలో ఒక్కొక్కరు, కర్ణాటక రాష్ట్రం బలగనూరు పీఎస్ పరిధిలో ఒకరు, ఆంధ్రప్రదేశ్ అనంతరపురం పెద్దవడుగూరులో ఒకరు, ఇలా వెంకటేశ్ సహా 11 మందిని నిందితుడు హతమార్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. రేవల్లి కేసులో బాధితుల నుంచి ఇళ్ల స్థలం, అనంతపురం కేసులో మూడున్నర ఎకరాల భూమి, నాగర్ కర్నూల్ కేసులో ఇంటి స్థలం, వెంకటేశ్ హత్య కేసులో రూ.9లక్షల నగదును నిందితుడు కాజేశాడు.

మూడున్నరేళ్లుగా కేసులు నమోదవుతున్నా.. సరైన ఆధారాలు లేకుండా నిందితుడు జాగ్రత్తపడటంతో పట్టుకోలేక పోయామని డీఐజీ తెలిపారు. ఈ కేసులో హత్యకు గురైన వారి 5 సెల్ ఫోన్లు నిందితుని వద్దే ఉండటంతో సిగ్నళ్ల ఆధారంగా మిగిలిన కేసుల్లోనూ నేరం బయటపడిందని చెప్పారు. గుప్తనిధులపైన ఆశతో ఎవరూ మోసపోవద్దని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని చౌహన్ ప్రజలకు సూచించారు. కేసు నమోదైన కొద్దిరోజుల్లోనే హత్యోదంతాలను ఛేదించిన పోలీసు అధికారులు సిబ్బందిని డీఐజీ అభినందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+