నాగార్జున సాగర్ డ్యాం భద్రత ఎస్పీఎఫ్ చేతికి, ఎందుకంటే?
నాగార్జున సాగర్ ప్రధాన డ్యాంపై ఇప్పటి వరకు భద్రత కోసం ఉన్న సీఆర్పీఎఫ్ బలగాలు ఆ బాధ్యత నుంచి వైదొలగాయి. ఈ క్రమంలో నాగార్జున సాగర్ డ్యాంను తిరిగి ఎస్పీఎఫ్ ఆధీనంలోకి తీసుకుంది. గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం రాజుకున్న విషయం తెలిసిందే.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు రోజు నాగార్జున సాగర్ డ్యాంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని కేంద్ర బలగాలను రంగంలోకి దించింది. ఫలితంగా గత ఏడాది డిసెంబర్ 3న నాగార్జున సాగర్ ఏపీ, తెలంగాణ రెండు వైపులా కేంద్ర బలగాలు మోహరించాయి. నాగార్జున సాగర్ ను తమ ఆధీనంలోకి తీసుకుని భద్రత విధులు నిర్వహించాయి.

ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ, జలవనరుల శాఖలు రెండు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి, కృష్ణా బోర్డుకు చెందిన అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన కూడా చేశారు. కాగా, ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం సాగర్ నిర్వహణ తెలంగాణే చూస్తుందని.. వెంటనే ప్రాజెక్టును అప్పగించాలని తెలంగాణ కేంద్రానికి వరుస లేఖలు రాసింది. కేంద్ర హోంశాఖ సూచించిన విధంగా 2023 నవంబర్ 28కి ముందు ఉన్న పరిస్థితిని కొనసాగేలా చూడాలని కోరింది.
ప్రస్తుతం నాగార్జున సాగర్ డ్యాం భద్రత కేఆర్‌ఎంబీ ఆధీనంలో ఉండటంతో సీఆర్పీఎఫ్ బలగాలతో నిఘాలో ఉంది. అయితే, ఇరు రాష్ట్రాల మధ్య అవగాహన రావడంతో సీఆర్పీఎఫ్ నుంచి భద్రతపరమైన చర్యలను ఎస్పీఎఫ్‌కు అప్పగించారు. ఇక, భద్రత విధుల నుంచి కేంద్ర బలగాలను ఉపసహరించాలని నిర్ణయం తీసుకోవడంతో తాజాగా వెనక్కి వెళ్లిపోయాయి.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications