Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కోదండరాంకు తోడుగా జనసేనోడు ఒచ్చిండు: పవన్‌పై నాయిని ఫైర్, వామపక్షాలకు వార్నింగ్

ఇందిరా పార్క్ వద్ద సోమవారం చేపట్టిన నిరసన కార్యక్రమంలో విధ్వంసానికి, దాడులకు పాల్పడటంపై తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్: ఇందిరా పార్క్ వద్ద సోమవారం చేపట్టిన నిరసన కార్యక్రమంలో విధ్వంసానికి, దాడులకు పాల్పడటంపై తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాలు, కమ్యూనిస్టులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీజేఏసీ చైర్మన్ కోదండరాంపైనా నిప్పులు చెరిగిన ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పైనా పరోక్షంగా విమర్శలు చేశారు.

కోదండరాంకు జనసేనోడు ఒచ్చి చేరిండు

కోదండరాంకు జనసేనోడు ఒచ్చి చేరిండు

హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద సోమవారం జరిగిన పరిణామాలపై స్పందించిన మంత్రి నాయిని మాట్లాడుతూ.. ప్రతిపక్షాల అండ చూసుకుని కోదండరాం చెలరేగిపోతున్నారని అన్నారు. ‘కోదండరాంకు తోడుగా జనసేనోడు ఒచ్చి చేరిండు. వీడు యాడికెళ్లి ఒచ్చిండో తెల్వదు' అపి తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు.

రోజూ కొట్టుకుంటారు..

రోజూ కొట్టుకుంటారు..

ధర్నాచౌక్ ముట్టడికి ప్రజల మద్దతు లేదని అన్నారు. విపక్షాలకు చెందిన వారు స్థానికులను కొడుతుంటే పోలీసులు సముదాయించారు తప్ప వారు ఎవరిపైనా చేయి చేసుకోలేదని పేర్కొన్నారు. ఇందిరాపార్క్ వద్ద ధర్నాలకు ప్రభుత్వం అనుమతి ఇస్తే రోజూ కొట్టుకుంటారని నర్సింహారెడ్డి అన్నారు.

రెచ్చిపోతే.. చచ్చిపోతారు.. వామపక్షాలకు హెచ్చరిక

రెచ్చిపోతే.. చచ్చిపోతారు.. వామపక్షాలకు హెచ్చరిక

నాయిని నర్సింహారెడ్డి వామపక్షాలు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. అతిగా రెచ్చిపోవద్దని, రెచ్చిపోతే చచ్చిపోతారన్నారు. తెలంగాణలో కమ్యూనిస్టులకు స్థానం లేదని అన్నారు. కేసీఆర్ పాలనలో ఏ సమస్యా లేకపోవడంతో ధర్నాచౌక్ వంటి చిన్న సమస్యను పెద్దదిగా చేసి రెచ్చిపోతున్నారని అది మంచిది కాదని హితవు పలికారు. రెచ్చిపోవద్దని, రెచ్చిపోతే ప్రజల చేతిలో చచ్చిపోతారని హెచ్చరించారు.

తోకపార్టీ లేనిదే బతుకుదెరువు లేదు..

తోకపార్టీ లేనిదే బతుకుదెరువు లేదు..

ఇప్పటికే తెలంగాణలో వామపక్షాలకు స్థానం లేకుండా పోయిందని, ఎన్నికల సమయంలో ఏదో ఒక పార్టీ తోక పట్టుకుంటే బతుకుదెరువు ఉండటం లేదని ఎద్దేవా చేశారు. మగ్ధూంభవన్‌లో దీక్షలు చేసి ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను ఫాసిస్టులు, నియంతలు అని తిట్టినా తమకేమీ అభ్యంతరం లేదన్నారు. అసలు ధర్నాచౌక్‌ను రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడా చెప్పలేదని నాయిని స్పష్టం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+