ఖమ్మం లోక్‌సభ అభ్యర్థి పేరును ప్రకటించిన కేసీఆర్

KCR: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించింది. మార్చి రెండో వారంలో షెడ్యూల్ వెలువడటం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి ముమ్మర కసరత్తు సాగిస్తోన్నాయి. గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి.

తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. అత్యధికం బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. తొమ్మిది స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతోంది. నాలుగు చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో మూడింటిని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఏఐఎంఐఎం ఒక స్థానాన్ని నిలబెట్టుకుంది.

Nama Nageswara Rao will contest as BRS candidate for Khammam Lok Sabha

ఈ ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని, మరిన్ని అధిక లోక్‌సభ స్థానాలను తన ఖాతాలో వేసుకోవాలనే పట్టుదలతో ఉంది బీఆర్ఎస్. గత ఏడాది నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయ భారాన్ని లోక్‌సభ బరిలో విజయంగా మలచుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తోంది.

ఈ క్రమంలో ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గాలపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి పెట్టారు. ఈ రెండింటి పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులతో స్వయంగా సమీక్ష నిర్వహించారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, సెక్రెటరీ జనరల్ కే కేశవరావు, మాజీ మంత్రి పువ్వాడ నాగేశ్వరరావు ఇందులో పాల్గొన్నారు.

ఈ సమీక్ష సమావేశం సందర్భంగా.. ఖమ్మం లోక్‌సభ అభ్యర్థి పేరును కేసీఆర్ ప్రకటించారు. పార్టీ సీనియర్ నేత, సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు పేరును ఖరారు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయనే బీఆర్ఎస్ క్యాండిడేట్‌గా పోటీ చేస్తారని ప్రకటించారు. 2019 తరహాలోనే ఆయనను మళ్లీ గెలిపించుకుని ఢిల్లీకి పంపించాలని కోరారు.

Nama Nageswara Rao will contest as BRS candidate for Khammam Lok Sabha

గతంలో ఇదే ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2009లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓడిపోయారు. అప్పటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై పరాజయాన్ని చవి చూశారు.

2019లో మరోసారి బీఆర్ఎస్ నుంచే పోటీ చేసిన నామా.. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి రేణుక చౌదరిని భారీ మెజారిటీతో మట్టికరిపించారు. నాలుగోసారి ఆయన లోక్‌సభకు పోటీ చేయబోతోన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+