నౌహీరా షేక్‌కు ఊరట: రూ.5కోట్లు డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశం
హైదరాబాద్: హీరాగోల్డ్ కేసులో హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ నౌహీరా షేక్‌కు ఊరట లభించింది. నౌహీరా షేక్‌పై సీసీఎస్ పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.
ప్రాసిక్యూషన్ వాదనలతో సంతృప్తి చెందని నాంపల్లి కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. నౌహీరా షేక్ ఐదు లక్షలతో రెండు షూరిటీలు కోర్టుకు చెల్లించాలని, 29వ తేదీలోపు 5 కోట్ల రూపాయలు కోర్టులో డిపాజిట్ చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది.

పాస్‌పోర్ట్ స్వాధీనం చేసి, కోర్టు అనుమతి లేకుండా బయటి దేశాలకు వెళ్లకూడదన్న నిబంధనలు విధించింది. అంతేగాక, కోర్టు అనుమతి లేకుండా హైదరాబాద్ వీడి వెళ్లొద్దని ఆదేశించింది.
కాగా, నౌహీరా షేక్ బాధితులు ఆమె తరఫు న్యాయవాదిని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో నాంపల్లి కోర్టు వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినిపించి బయటకు వెళ్లేందుకు వచ్చిన ఆమె తరఫు న్యాయవాది వాహనాన్ని బాధితులు అడ్డుకున్నారు. న్యాయవాది తరఫు వ్యక్తులు వారిని నెట్టేసి వాహనాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.
{document1}












Click it and Unblock the Notifications