మహిళను, కుమారుడిని రక్షించారు: శిథిలాల కింద వీరే...
నానక్‌రామ్ గుడా భవనం కూల్చివేత ఘటనలో సహాయ బృందాలు ఓ మహిళను, ఆమె కుమారుడిని రక్షించారు. శథిలాల కింద చిక్కుకున్నవారిని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
హైదరాబాద్: హైదరాబాదులోని నగరంలోని నానక్‌రాంగూడలో ఏడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో సహాయ బృందాలు శిథిలాల కిందన ఉన్న ఓ మహిళను, ఆమె కుమారుడిని రక్షించాయి. ఆమె రేఖగా, ఆమె కుమారుడిని రోహణ్‌గా గుర్తించారు. రేఖ భర్త శివ శిథిలాల కింద మరణించాడు. వారు ఛత్తీస్‌గడ్‌కు చెందినవారని సమాచారం. శివతోపాటు మరో నలుగురి మృతదేహాలను కూడా బయటికి తీశారు.
కూలీలు నిద్రిస్తుండగా: నానక్‌రాంగూడలో కూలిన ఏడంతస్తుల బిల్డింగ్, ఇవే కారణమా?
కాగా, శిథిలాల కింది నుంచి శుక్రవారం ఉదయానికి కూడా ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. పోలినాయుడు, నారాయణ, వెంకటలక్ష్మి, సాంబయ్య, పైడమ్మ, గౌరి, పోలి నాయుడు, నారాయణ, శంకరరావు, దుర్గారావు వెంకటలక్ష్మి శిథిలాల కింద ఉన్నట్లు భావిస్తున్నారు. వారంతా విజయవాడలోని బొబ్బిలి ప్రాంతానికి చెందినవారు.

గాయపడిన వారిని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కిందకు పైపుల ద్వారా ఆక్సిజన్ పంపుతున్నారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించేందుకు పది అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. హైదరాబాద్ నానక్‌రామగూడలో నిర్మాణంలో ఉన్న ఏడు అంతస్తుల భవనం గురువారం రాత్రి కుప్పకూలిన విషయం తెలిసిందే.
భవనం యజమాని సత్తుసింగ్ అలియాస్ సత్యనారాయణ సింగ్ అందుబాటులో లేడని తెలుస్తోంది. అతనిపై పలు పోలీసు స్టేషన్లలో కేసులు కూడా నమోదైనట్లు తెలుస్తోంది. భవనానికి సరైన అనుమతులు లేవని తేలిందని మేయర్ రామ్మోహన్ చెప్పారు.
-
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications