అల్లు అర్జున్ విడుదల వెనుక బాలయ్య ? తెరవెనుక ఏం చేశారంటే..!
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ను తన పుష్ప2 సినిమా విడుదల సందర్బంగా హైదరాబాద్ సంధ్యథియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో నిన్న పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన్ను చిక్కడపల్లి పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లి అక్కడి నుంచి నాంపల్లి కోర్టులో హాజరుపర్చి చంచల్ గూడ జైలుకు పంపారు. ఆ తర్వాత తెలంగాణ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో ఇవాళ ఉదయం విడుదలయ్యారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకోగా.. ఇందులో తెరవెనుక చాలా మంది కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్ ను నిన్న జూబ్లీ హిల్స్ లోని ఇంటి నుంచి అరెస్టు చేసిన తర్వాత సీనియర్ హీరో బాలకృష్ణ ఆయన తండ్రి అల్లు అరవింద్ కు ఫోన్ కాల్ చేసి ధైర్యం చెప్పారు. అంతే కాకుండా నిర్మాత నాగవంశీని అల్లు అర్జున్ ను ఉంచిన చిక్కడపల్లి పోలీసు స్టేషన్ కు పంపారు. మరోవైపు అల్లు అరవింద్ తో కాంటాక్ట్ లో ఉంటూ ఎప్పటికప్పుడు వివరాలు అందజేశారు. అదే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ బెయిల్ రావాలని లేదంటే సోమవారం వరకు వచ్చే అవకాశం లేదని అరవింద్ టెన్షన్ పడుతున్న విషయాన్ని నాగవంశీ బాలయ్య దృష్టికి తెచ్చారు.

దీంతో బాలయ్య అల్లు అరవింద్ కు కాల్ చేసి వివరాలు తెలుసుకుని వెంటనే తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డికి కాల్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది. సంధ్య థియేటర్ ఘటన దారుణమే అయినా చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోమని స్పష్టం చేసినట్లు సమాచారం. అదే సమయంలో అల్లు అర్జున్ బెయిల్ విషయంలో ప్రభుత్వం నుంచి సహకారం కోరినట్లు తెలుస్తోంది. దీంతో రేవంత్ రెడ్డి కూడా పీపీకి సంబంధిత ఆదేశాలు ఇచ్చి అరవింద్ కోరుకున్నట్టు బెయిల్ ఇప్పించినట్లు అల్లు కాంపౌండ్ లో చర్చ జరుగుతోంది. దీంతో అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యాక కూడా ప్రభుత్వంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు.












Click it and Unblock the Notifications