Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రేవంత్ రెడ్డికి బాలకృష్ణ శుభాకాంక్షలు: ఏమన్నారంటే?

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు ప్రముఖ సినీనటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ప్రజా సేవ పరమావధిగా రాజకీయాల్లో అంచెలంచెలుగా రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వారి ఆకాంక్షను నేరవేర్చాలన్నారు బాలకష్ణ.

'అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధిపదంగా ముందుకు పోవాలని ఆశిస్తున్నాను. ముఖ్యమంత్రి మీ పాలన మార్క్‌తో తెలంగాణ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేయాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను' అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు చేపడుతారనే అంశంపై ఇప్పటి వరకు కొనసాగిన ఉత్కంఠకు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటనతో తెరపడిన విషయం తెలిసిందే.

Nandamuri Balakrishna congratulations Revanth reddy, next CM of telangana

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ కీలక నేత కేసీ వేణుగోపాల్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లంతా కలిసి పనిచేస్తారని చెప్పారు. సీనియర్లందరికీ సముచిత స్థానం ఉంటుందన్నారు. మరోవైపు, డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత మంత్రులు కూడా ప్రమాణం చేస్తారు.

డిసెంబర్ 9వ తేదీన కృతజ్ఞత సభ పేరిట ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, తదితరులను ఆహ్వానించనున్నట్లు తెలిసింది.

రేవంత్ రెడ్డి సొంత గ్రామంలో సంబరాలు

కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రకటించిన నేపథ్యంలో ఆయన స్వగ్రామం నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక నుంచి మా ఊరు కొండారెడ్డిపల్లి కాదని.. ముఖ్యమంత్రి ఊరు అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. డిసెంబర్ 7వ తేదీ గురువారం రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించనున్నట్లు సమాచారం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+