Child Marriage: వీడ్ని ఏం చేయాలి..?
ఓ వైపు సాంకేతిక యుగం కొత్త పుంతలు తొక్కుతోంది. డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) యుగం నడుస్తోంది. టెక్నాలజీ ఏ రోజు ఎలా మారుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కానీ కొంతమంది మాత్రం యుగాలు మారినా అవే అనాగరిక ఆచారాలు, సంప్రదాయాలంటూ అక్కడే ఆగిపోతున్నారు. ఇప్పటికీ వరకట్నం, బాల్య వివాహాలు అంటూ సమాజాన్ని పట్టి పీడుస్తూనే ఉన్నాయి. అలాంటి ఓ అమానవీయ ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో జరిగింది.
అభం శుభం తెలియని ఆ చిన్నారికి అప్పుడే పెళ్లి చేశారు తల్లిదండ్రులు. 8వ తరగతి చదువుతున్న ఆ 13 ఏళ్ల బాలికకు 40 ఏళ్ల వ్యక్తితో వివాహం జరిపించారు. ఆ వ్యక్తి సంపన్నుడు కావడంతో చిన్నారిని అతనికిచ్చి పెళ్లి చేశారు. తమ ఆర్థిక పరిస్థితి బాగోలేక ఆ తల్లిదండ్రులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా నందిగామలో జరిగింది. 13 ఏళ్ల బాలికకు చేవెళ్ల మండలం, కందివాడకు చెందిన శ్రీనివాస్ గౌడ్(40) తో మే 28న బాల్య వివాహం స్థానిక ఆలయంలో చేశారు. అప్పటినుంచి చిన్నారి తల్లి వద్దనే ఉంటుంది.

అయితే తనకు ఇష్టం లేని పెళ్లి చేశారని బాలిక పాఠశాలలోని ఉపాధ్యాయులకు చెప్పడంతో వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు బాలిక తల్లితో పాటు పెళ్లి కొడుకు, మధ్యవర్తి, పెళ్లి చేసిన పూజారిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు.












Click it and Unblock the Notifications