Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీఆర్ఎస్ ను మోసంచేస్తే చీరేస్తా... ఎర్రబెల్లి సోదరుడు లక్ష్యంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సంచలనం

వరంగల్ తూర్పు రాజకీయం వేడెక్కుతోంది. వరంగల్ తూర్పు లో టిఆర్ఎస్ పార్టీ నాయకుడు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు పార్టీకి రాజీనామా చేయనున్న నేపథ్యంలో రసవత్తర రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ ఎర్రబెల్లి ప్రదీప్ రావును బుజ్జగించడానికి ప్రయత్నం చేసిన టిఆర్ఎస్ పార్టీ నేతలు ఆయనను పార్టీ మారకుండా చూడడంలో విఫలమయ్యారు. ఇక బుజ్జగింపుల పర్వం ఫలించకపోవడంతో, ఆసక్తికరంగా బెదిరింపుల పర్వాన్ని ప్రారంభించారు వరంగల్ తూర్పు నాయకులు.

ఎర్రబెల్లి ప్రదీప్ రావుపై విరుచుకుపడిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

ఎర్రబెల్లి ప్రదీప్ రావుపై విరుచుకుపడిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

తాజాగా వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తన పుట్టినరోజు నాడు, బర్త్ డే సెలబ్రేషన్స్ వేదికపై తనదైన శైలిలో రెచ్చిపోయారు. టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి, బిజెపి తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అవుతున్న ఎర్రబెల్లి ప్రదీప్ రావు ను టార్గెట్ చేసి పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎర్రబెల్లి ప్రదీప్ రావు, ఆయన అనుచరులపై పరోక్షంగా విరుచుకుపడిన వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ టిఆర్ఎస్ పార్టీని మోసం చేస్తే చీరేస్తాం అంటూ విరుచుకుపడ్డారు.

టీఆర్ఎస్ పార్టీని మోసం చేస్తే ఇక గుద్ధుడే... స్ట్రాంగ్ వార్నింగ్

టీఆర్ఎస్ పార్టీని మోసం చేస్తే ఇక గుద్ధుడే... స్ట్రాంగ్ వార్నింగ్

ఎవరైనా టీఆర్ఎస్ పార్టీని మోసం చేస్తే ఇక గుద్దుడే అంటూ వార్నింగ్ ఇచ్చారు. తాను అమాయకుడు అని అనుకుంటున్నారేమో, అవసరమైతే కొమరం భీమ్ లా తిరగబడతానని, పులిలా పంజా విసిరి చీరేస్తానని ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ హాట్ కామెంట్స్ చేశారు. ఇక రోజులు లెక్క పెట్టుకోండి అంటూ హెచ్చరికలు జారీ చేశారు నన్నపనేని నరేందర్. అంతేకాదు ఆయన పూటకో పార్టీ మార్చే చిల్లర నాయకుడు అంటూ నన్నపనేని నరేందర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

పార్టీ కార్యకర్తల జోలికొస్తే దేనికైనా సిద్ధం .. ఓపెన్ ఛాలెంజ్

పార్టీ కార్యకర్తల జోలికొస్తే దేనికైనా సిద్ధం .. ఓపెన్ ఛాలెంజ్

టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని తేల్చి చెప్పిన ఆయన వారి జోలికి వస్తే ఎంతకైనా సిద్ధమంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీకి నష్టం చేసి వెళ్లే నేతకు తన ఓపెన్ చాలెంజ్ అంటూ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ రెచ్చిపోయారు. మొత్తానికి టిఆర్ఎస్ పార్టీలో చోటుచేసుకున్న వర్గ పోరు ఎర్రబెల్లి ప్రదీప్ రావు పార్టీని వీడి బీజేపీ బాట పట్టడానికి కారణం కాగా, ఇక ఎర్రబెల్లి ప్రదీప్ రావు ను టార్గెట్ చేస్తూ నన్నపనేని నరేందర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు వారి మధ్య ఉన్న విభేదాలను బహిర్గతం చేశాయి.

పార్టీకి రాజీనామా చెయ్యకముందే ఎర్రబెల్లికి స్ట్రాంగ్ వార్నింగ్, ఎమ్మెల్యే వ్యాఖ్యలపై చర్చ

పార్టీకి రాజీనామా చెయ్యకముందే ఎర్రబెల్లికి స్ట్రాంగ్ వార్నింగ్, ఎమ్మెల్యే వ్యాఖ్యలపై చర్చ

టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయకముందే, ఆయనపై వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ చేసిన వ్యాఖ్యలు వరంగల్ తూర్పు నియోజకవర్గంతో పాటుగా, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పొలిటికల్ హీట్ ను మరింత పెంచాయి.

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు, నన్నపునేని నరేందర్ కు ప్రచ్చన్న యుద్ధం చాలా కాలంగా సాగుతుంది. తాజా పరిణామాలతో మరోమారు ఆసక్తికర చర్చకు కారణం అయ్యింది. ఇక ఈ ఎపిసోడ్లో ముందు ముందు ఏం జరుగుతుందో అన్నది వేచి చూడాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+