డాక్టర్లు కాకపోయినా! ప్రతీ ఒక్కరూ ప్రాణాలు కాపాడొచ్చు: బ్రాహ్మణి
ఎన్టీఆర్ మనుమరాలిగా పుట్టడం తన అదృష్టమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోడలు నారా బ్రాహ్మణి అన్నారు. ఎన్టీఆర్ 21వ వర్ధంతి సందర్బంగా ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన లెజెండరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్.
హైదరాబాద్: ఎన్టీఆర్ మనుమరాలిగా పుట్టడం తన అదృష్టమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోడలు నారా బ్రాహ్మణి అన్నారు. ఎన్టీఆర్ 21వ వర్ధంతి సందర్బంగా ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన లెజెండరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్‌ను నారా భువనేశ్వరి, బ్రాహ్మణి ప్రారంభించారు.
ఈ సందర్బంగా బ్రాహ్మణి మాట్లాడుతూ... బ్లడ్ డొనేషన్ క్యాంప్‌కు అద్భుతమైన స్పందన వచ్చిందని, తెలుగు రాష్ట్రాల్లో 185 బ్లడ్ క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు లాంటి ప్రత్యేక సందర్భాల్లో రక్తదానం చేయాలని బ్రాహ్మణి ఆకాంక్షించారు.
రక్తదానం చేసేందుకు ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. అన్ని దానాల్లోకెళ్లా రక్తదానం గొప్పదని అన్నారు. ప్రాణాపాయంలో ఉన్నవారికి రక్తదానం చేసి వారి ప్రాణాలను కాపాడాలని సూచించారు.

రక్తదానం ఎంతోమందికి ప్రాణాలు పోస్తుందని అన్నారు. ప్రతి సంవత్సరం రక్తదానం చేయాలని సూచించారు. మనం అందరం డాక్టర్లం కాకపోయినా రక్తదానం చేయడం ద్వారా ఇతరుల ప్రాణాలు కాపాడవచ్చని చెప్పారు. ఈ సందర్భంగా రక్తదానం చేసినవారందరికీ బ్రాహ్మణి కృతజ్ఞతలు తెలిపారు.
బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో బాలకృష్ణ
టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని రోగులకు పండ్లను అందజేశారు.












Click it and Unblock the Notifications