కెసిఆర్! ఫాంహౌజ్‌లో పడుకుంటే ఇలానే ఉంటుంది: లోకేష్ సెటైర్

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుపై విరుచుకుపడ్డారు. మిగులు బడ్జెట్‌‌తో ప్రారంభమైన తెలంగాణ రాష్ట్రం.. ఇప్పుడు లోటు బడ్జెట్‌లోకి పోయిందని అన్నారు.

అంతేగాక, సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌లో పడుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రమాదబీమా చెక్కులను నారా లోకేష్ గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

Nara lokesh lashes out at KCR

ప్రమాద బీమా కింద టీడీపీ కార్యకర్తలకు రూ.10 కోట్లు ఇచ్చామని తెలిపారు. 'టీఆర్ఎస్ నేతలు తాము కూడా తమ కార్యకర్తలకు బీమా ఇచ్చామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని.. వారు ఎంత మందికి ఇచ్చారో? చెప్పాలని లోకేష్ నిలదీశారు.

తెలంగాణ బంగారు తెలంగాణ అయితే కరెంట్ ఛార్జీలు ఎందుకు పెంచారంటూ ధ్వజమెత్తారు. దళితులకు భూ పంపిణీ, మైనార్టీ, ఎస్టీ రిజర్వేషన్ల అమలుకు తెలంగాణలో ఏ ఆంధ్రా పార్టీ అడ్డు పడింది? అంటూ సీఎం కెసిఆర్‌ను లోకేష్ సూటిగా ప్రశ్నించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugudesam Party leader Nara lokesh on Thursday lashed out at Telangana CM K Chandrasekhar Rao.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి