ప్రధాని సోదరుడికి నిజామాబాద్‌లో ఘనస్వాగతం

Subscribe to Oneindia Telugu

నిజామాబాద్‌: డిచ్‌పల్లి మండలం బర్దపూర్‌ గ్రామ పరిధిలోని అమృతాగార్డెన్‌కు వచ్చిన నరేంద్ర మోడీ తమ్ముడు ప్రహ్లాద్‌ మోడీకి రాష్ట్ర గాండ్ల తేలికుల సంఘం ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. ఆయన గురువారం హైదరాబాద్‌ నుంచి నాందేడ్‌కు వెళ్తుండగా మార్గమాధ్యలో ఇక్కడ కాసేపు ఆగారు.

ఈ మేరకు గాండ్ల తేలికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఇందల్‌వాయి కిషన్‌ నేతృత్వంలో సంఘం నాయకులు ప్రహ్లాద్‌ మోడీని కలిశారు. వారి సంఘం కాలమానిని ఆయన చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు.

narendra modi brother visited nizamabad district

గాండ్ల తేలికుల స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట వచ్చిన పర్యటన బృందం ప్రకాష్‌ రాథోడ్‌ మోడీ, హుకుమ్‌ సాహూ, కోర్పోల్‌ ప్రవీణ్‌ మోడీ తదితరులను సన్మానించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు నర్సింలు, రాజు, బాలరాజు, పోశెట్టి, గంగాధర్‌, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Prime Minister Narendra Modi brother Prahlad Modi visited Nizamabad district on Thursday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి