జూబ్లీహిల్స్ బై పోల్ కాంగ్రెస్ అభ్యర్థి ఫిక్స్..? ఎవరీ నవీన్ యాదవ్..?
తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దగ్గరపడుతున్న క్రమంలో రోజురోజుకూ సమీకరణాలు మారుతున్నాయి. అయితే ఈ బై పోల్ లో ఎవరిని నిలబెట్టాలి అన్న అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బీఆర్ఎస్ సీనియర్ నేత మాగంటి గోపినాథ్ జూన్ 8న మరణించిన విషయం తెలిసిందే. ఆయన ఆకస్మిక మరణంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఖాళీ స్థానంలో ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ఏడాది చివరిలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ సమయంలోనే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను ప్రకటిస్తుందని స్పష్టం అవుతోంది.
అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ముందున్న ప్రధాన లక్ష్యం.. జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడమే. అయితే అధికార కాంగ్రెస్ మాత్రం ఈ సారి ఆ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని పలు ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం పలువురు ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేసారు. అయితే ఈ రేసులో ప్రధానంగా మాజీ ఎంపీ మహ్మద్ అజారుద్దీన్, పీజేఆర్ కూతురు విజయారెడ్డి, నాంపల్లిలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన ఫిరోజ్ ఖాన్ అలాగే గతంలో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి ఓడిన నవీన్ యాదవ్ ల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.
మరోవైపు ఆశావహులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన అజహరుద్దీన్... ఉపఎన్నిక బరిలో నిలవాలని భావించారు. ఈ క్రమంలోనే టికెట్ తనకే వస్తుందని కూడా ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే అధిష్టానంతో పరిచయాలు ఉన్న అజహరుద్దీన్‌కే కాంగ్రెస్ టికెట్ దక్కే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం బలపడింది.

అయితే తాజాగా ప్రముఖ విద్యావేత్త, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ. కోదండరాం.. అలాగే మైనారిటీ నాయకుడు, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పేర్లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవులకు తెలంగాణ కేబినెట్ ఆమోదించింది. ఈ మేరకు ఇద్దరి పేర్లను గవర్నర్ ఆమోదానికి పంపింది. గతంలో కోదండ రాం, అమీర్ అలీ ఖాన్ లు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టారు. అయితే వారి నామినేషన్లు ప్రక్రియను తప్పుబట్టిన సుప్రీంకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఇక జూబ్లీహిల్స్ టికెట్ తనకే వస్తుందని అజారుద్దీన్ ధీమా వ్యక్తం చేశారు. అంతేకాక ఇటీవల దిల్లీ వెళ్లి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. అయితే తాజాగా ఆయనకు ఎమ్మెల్సీ రావడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ టికెట్ రేసు నుంచి ఆయన తప్పుకున్నట్టుగా భావించవచ్చు.
ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న సమీకరణాల దృష్ట్యా నవీన్ యాదవ్ కే కాంగ్రెస్ టికెట్ దక్కవచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు జూబ్లీహిల్స్ టికెట్ స్థానికులకే ఇస్తామని, ఈ విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని కాంగ్రెస్ సీనియర్ నేత, హైదరాబాద్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల ప్రకటన చేశారు. దీంతో నవీన్ యాదవ్ కే టికెట్ అని కాంగ్రెస్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. బీసీ వర్గానికి చెందిన నవీన్ యాదవ్.. జూబ్లీహిల్స్ ప్రజలకు సుపరిచితుడిగా ఉన్నారు. ఎప్పటినుంచో స్థానిక సమస్యలపై పోరాటం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ నుంచి రెండు సార్లు పోటీ చేసి ఓటమి చెందారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ కోసం పనిచేశారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications