పిల్లి గడ్డమాయన: బాబుపై నాయిని వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణలో మరో రెండుమూడేళ్లలో ఎన్నికలు వస్తాయని, తాము అధికారంలోకి వస్తామని పిల్లిగడ్డమాయన పిచ్చికలలు కంటున్నాడని తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఆయన తీరుతో విసిగిపోయిన ఆయన పార్టీ వాళ్లే గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారని నాయిని నర్సింహారెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై పరోక్ష విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజలు టీడీపీని తిరస్కరించినా మళ్లీ అధికారంలోకి వస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు.

ఆదివారం తెలంగాణ భవన్‌లో సనత్‌నగర్, అంబర్‌పేట నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలకు చెందిన పలువురు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరారు. అనంతరం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న తీవ్ర కరెంట్ కొరతకు టీడీపీ, కాంగ్రెస్‌లే కారణమన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అమలుచేసి హైదరాబాద్‌కు తాగునీటిని అందిస్తామన్నారు.
గోదావరి జలాలను వినియోగించి విద్యుత్ ఉత్పత్తికి కృషి చేస్తామని, 50వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. సింగరేణిలో లక్షన్నర మందికి ఉపాధికి కల్పిస్తామన్నారు. సింగరేణిలో కేంద్ర ప్రభుత్వవాటాలను కూడా కొనుగోలుచేసి పూర్తిగా తెలంగాణకే వచ్చేలా ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు.












Click it and Unblock the Notifications