టీవీ ఛానల్ సీఈవో చెప్పడంతో.. నయీం కేసులో తొలి వికెట్ డౌన్

హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం కేసులో తొలి వికెట్ పడింది. నల్గొండ టూటౌన్ సీఐ రవీందర్ పైన ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆయనను జిల్లా హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇటీవల సిట్ ఐ10 టీవీ చానల్ సీఈవో హరిప్రసాద్ రెడ్డిని విచారించింది.

వారే కీలకం: నయీంతో నేతల లింక్‌పై సస్పెన్స్, సామ సంజీవరెడ్డి అరెస్ట్!

నయీం గ్యాంగ్‌కు సీఐ రవీందర్ సహకరించినట్టు విచారణలో అతను చెప్పాడు. దీంతో సీఐపై వేశారని తెలుస్తోంది. నయీం ప్రధాన అనుచరుల్లో ఒకడైన సామ సంజీవ రెడ్డిని మంగళవారం రాత్రి పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ సమీపంలో సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

నయీం ఎన్ కౌంటర్ అనంతరం సంజీవ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లాడు. నయీం డెన్‌లలో స్వాధీనం చేసుకున్న అనేక పత్రాలు ఇతడి పేరుమీద రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయని తేలింది.

Nayeem case: Police name 66 journalists 'who received

నయీంకు చెందిన వందల కోట్ల ఆస్తులకు సంజీవ రెడ్డి బినామీగా తేలింది. సంజీవ రెడ్డి అరెస్ట్ విషయాన్ని పోలీసులు నిర్ధారించవలసి ఉంది. అయితే ముత్తంగి విష్ణు లాడ్జిలో తన కొడుకుతో పాటు సంజీవ రెడ్డి 204 గదిలో దిగాడని, సిట్ సిబ్బంది దాడిచేసి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది.

భువనగిరికి చెందిన న్యాయవాది ఎంఏ రహీంను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. నాలుగు రోజుల నుంచీ ఆయన కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భువనగిరి బార్‌ అసోసియేషన నేతలు డీఎస్పీ మోహన రెడ్డిని మంగళవారం కలిశారు.

మరోవైపు, నయీంతో టచ్‌లో ఉన్న అధికారులపై దర్యాఫ్తు బృందం ఆరా తీస్తోంది. ప్రస్తుతం ఐదుగురు ప్రధాన అనుచరుల కోసం సిట్‌ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

నయీం సైన్యంలో శేషన్న, రామన్న, ఖలీల్‌, జహంగీర్‌, సురేందర్‌లు కీలక వ్యక్తులని సిట్‌ గుర్తించింది. నయీం ఎనకౌంటర్‌తో అజ్ఞాతంలోకి వెళ్లిన వీరిని పట్టుకుంటే నయీం వెనుక ఉన్న పోలీస్‌, రాజకీయ, మీడియా లింకుల వీడుతాయని భావిస్తున్నారు. నయీం కేసులో 66 మంది జర్నలిస్టుల పేర్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. వారికి నయీం డబ్బులు ఇచ్చారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+