నయీం కేసులో కొత్త కోణం: ఫర్హానా కీ రోల్, ఆమె పేరిట ఆస్తులు, గోవాలో గెస్ట్ హౌస్
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా మరో షాకింగ్ విషయం వెలుగు చసింది. ఫర్హానా పరిట పెద్ద ఎత్తున లావాదేవీలు ఉన్నట్లుగా దర్యాఫ్తు అధికారులు గుర్తించారు. గోవాలో గెస్ట్ హౌస్ కూడా ఫర్హానా పేరిట రిజిస్ట్రేషన్ అయినట్లుగా గుర్తించారు.
నయీం ప్రతి కదలిక వెనుక ఫర్హానా పాత్ర ఉన్నట్లుగా గుర్తించారు. పుప్పాలగూడలో ఫర్హానాకు నయం ఇల్లు కొనిచ్చిందని తెలుస్తోంది. ఫర్హానాతో తరుచూ నయీం గోవాకు వెళ్లేవాడని తేలింది. అంతేకాదు, గోవాలో ఆమె ముందే సయీం సెటిల్మెంట్లు చేసేవాడని తేలింది. తద్వారా వంట మనిషి ఫర్హానా చుట్టు ఉచ్చు బిగుస్తోంది.
నయీంకు సాయం చేసిన వాళ్ల ద్వారానే..
నాలుగు రోజుల క్రితం మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్‌లో పోలీసులు గ్యాంగ్ స్టర్ నయీంను ఎన్‌కౌంటర్ చేశారు. ఈ కేసులో తాజాగా మరో అంశం వెలుగు చూసింది. నయీంకు ఏ పోలీసులు అయితే సహకారం అందించారో.. అదే పోలీసుల సహకారంతో పక్కా ప్లాన్ ప్రకారం ఎన్‌కౌంటర్ చేసి ఉంటారనే వాదనలు వినిపిస్తున్నాయి.

నయీం డీల్‌లు కుదిర్చేటప్ుడు, సెటిల్మెంట్లు చేసేటప్పుడు అత్యున్నత రాజకీయ నాయకుల కుటుంబాలను కడా లెక్క చేసేవాడు కాదు. ఎవరైతే నాకేమిటి అనుకునేవాడు. అతను గత రెండేళ్లుగా అజ్ఞాతంలో ఉన్నాడని చెబుతున్నప్పటికీ.. హైదరాబాదులోనే ఉన్నాడని తెలుస్తోంది.
కాగా, గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్‌కౌంటర్ అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు వేగవంతమయింది. నయీం గతంలో పాల్ప డిన అక్రమాలతోపాటు అతడికి సహకరించిన వారి వివరాల్ని ఆరా తీయడంలో బృందం నిమగ్నమైంది.
ఎన్‌కౌంటర్ అనంతరం ఇప్పటివరకు నమోదైన కేసుల్ని సిట్‌కు బదలాయించారు. ఈమేరకు ఇప్పటి వరకు మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్, నల్గొండ జిల్లాలోని నల్గొండ, భువనగిరి, మిర్యాలగూడతోపాటు సైబరాబాద్ ప్రాంతాల్లోని పలు కేసులకు సంబంధించి పలు ఆయుధాల్ని స్వాధీనం చేసుకుంది.












Click it and Unblock the Notifications