చెల్లితో కలిసే బావను చంపిన నయీమ్, పసిపిల్లలకు 'పచ్చిమిర్చి' పనిష్ మెంట్
హైదరాబాద్ : నరరూప రాక్షసుడు అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం గ్యాంగ్ స్టర్ నయీమ్. కనీస మానవత్వం కూడా లేకుండా సాటి మనుషుల పట్ల నయీమ్ వ్యవహరించిన తీరును చూస్తే.. ఎవరైనా సరే నయీమ్ ను దూషించక మానరు. నయీమ్ మాత్రమే కాదు.. అతని తల్లి, భార్య, చెల్లి అందరిదీ ఇదే తీరు. పనిమనుషుల పట్ల, ఆఖరికి సొంత బావ పట్ల కూడా నయీమ్ అత్యంత కర్కషంగా వ్యవహరించిన తీరు అతని క్రూరత్వానికి నిదర్శనం.
నయీమ్ ఆగడాలను చూసి.. అతని నుంచి దూరంగా వెళ్లి బ్రతకాలనుకున్నాడు అతని బావ నదీం. ఇదే విషయాన్ని అతన్ని భార్య, నయీమ్ సోదరి అయిన సలీమాతో చెప్పాడు. అయితే సోదరుడి నుంచి దూరంగా వెళ్లడం ఇష్టం లేని సలీమా.. విషయాన్ని ఆమె తల్లి తాహెరాకు, సోదరుడు నయీమ్ ద్రుష్టి తీసుకెళ్లింది.
నదీం తన నుంచి బయటపడితే.. తన నేర చరిత్ర అంతా బయటకు వచ్చే అవకాశం ఉండడంతో.. బావ అని కూడా చూడకుండా నదీంను మట్టుపెట్టడానికే మొగ్గుచూపాడు నయీమ్. ఇందుకు అతని సోదరి సలీమా, తల్లి తాహెరా కూడా సహకరించారు. అప్పట్లో గగన్ పహాడ్ లోని పప్పు హౌజ్ లో ఉన్న నయీమ్.. ఓరోజు రాత్రి నదీంను తన బెడ్ రూమ్ కు పిలిచాడు.

అనంతరం తన భార్య హసీనా మెడలో ఉన్న చున్నీతో నదీం మెడకు ఉరి బిగించాడు. నయీమ్ భార్య హసీనాతో పాటు నదీం భార్య సలీమా కూడా ఆ చున్నీని రెండువైపులా గట్టిగా లాగి నదీంను చంపేశారు. ఆ తర్వాత ఫర్హానా, నస్రీన్, కరీనా, సదా, తాహెర్, డ్రైవర్ కిశోర్ లతో కలిసి మహబూబ్ నగర్ లోని కొత్తూర్ సమీపంలో ఉన్న ఓ నిర్జన ప్రదేశానికి మృతదేహాన్ని తరలించాడు నయీమ్. అక్కడే మృతదేహంపై పెట్రోల్
పోసి దహనం చేశారు. ఇదంతా జరిగిన ఏడాదికి తన మకాంను నెక్నాంపూర్ కు మార్చాడు నయీమ్.
అనుచరుడి నుంచి నదీం బావగా..:
నయీమ్ సోదరి సలీమా భర్త ప్రమాదంలో మరణించడంతో.. సోదరి సలీమాను పెళ్లి చేసుకోవాల్సిందిగా అనుచరుడైన నదీంను కోరాడు నయీమ్. అప్పటికి భువనగిరిలో విజయ్ కుమార్ పేరుతో నయీమ్ అనుచరుడిగా ఉన్న నదీం.. పెళ్లి సమయంలో తన పేరును 'నదీం'గా మార్చుకున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు నయీమ్ వద్ద సుదీర్ఘ కాలం డ్రైవర్ గా కూడా పనిచేశాడు నదీం.
బలమైన కర్రతో పసిపిల్లను చితకబాది :
నయీమ్ ఇంట్లో నస్రీన్ అనే 15 ఏళ్ల బాలిక పనిచేస్తుండేది. ఎప్పుడూ ఆ బాలికను వేధింపులకు గురిచేసే నయీమ్ కుటుంబ సభ్యులు.. ఓరోజు తీవ్రంగా దూషించడంతో ఏడుస్తూ కూర్చుండిపోయింది. అనంతరం ఇంటికి వచ్చిన నయీమ్ కు విషయం చెప్పడంతో.. ఓ బలమైన కర్రతో ఆ చిన్నారిని విచక్షణా రహితంగా చితకబాదాడు నయీమ్.
తీవ్ర గాయాలపాలైన ఆ బాలికకు భార్య హసీనా ద్వారా నిద్రమాత్రలు వేయించాడు. ఆ తర్వాత బాలికను ఇంట్లోనే వదిలేసి కుటుంబమంతా ఓ ఫంక్షన్ కు వెళ్లారు. తిరిగి తెల్లవారు జామున అందరు ఇంటికి చేరుకోగా.. అప్పటికే బాలిక చనిపోయింది. దీంతో నయీమ్, డ్రైవర్ కిషోర్, నయీమ్ తల్లి తాహెర్ ఆ బాలిక మృతదేహాన్ని కారులో ఎక్కడికో తరలించారు. బాలిక మృతదేహాన్ని ఏంచేశారనేది తెలియాలంటే.. నయీమ్ తల్లి తాహెర్, డ్రైవర్ కిశోర్ ల ఆచూకీ తెలిస్తే గానీ ఆ నిజాలు బయటపడేలా లేవు.
పచ్చిమిర్చి జ్యూస్ తో పనిష్ మెంట్..:
అనేక మందిని బాలికలను తన లైంగిక పైశాచికత్వానికి బలి తీసుకున్న నయీమ్.. వాళ్ల పట్ల చేసిన ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. లైంగికంగా తన కోరిక తీర్చని బాలికల చేత బలవంతంగా పచ్చిమిర్చి రసం తాగించి.. మంటకు తాళలేక బాలికలు ఏడుస్తుంటే.. నయీమ్ పైశాచికానందాన్ని పొందేవాడు. నయీమ్ భార్య హసీనా.. తల్లి తాహెరా లే దగ్గరుండి మరీ ఆ బాలికలను నయీమ్ గదిలోకి పంపించేవారని పోలీసుల విచారణలో తేలింది.












Click it and Unblock the Notifications