• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వ్యాస్ హత్య నుంచే మాజీ డీజీపీతో లింక్, నయీం బెడ్రూంలో.. (పిక్చర్స్)

|

హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం ఎన్‌కౌంటర్ నేపథ్యంలో అతని గురించిన ఎన్నో షాకింగ్ అంశాలు వెలుగు చూస్తున్నాయి. మొత్తం వివరాలను రాబట్టే పనిలో సిట్ పడింది. నయీంతో ఓ మాజీ డీజీపీకి కూడా సంబంధాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

నయీం కేసులో అతనికి చెందిన డైరీలు కీలకంగా మారాయి. ఆ డైరీల ఆధారంగా ఓ మాజీ డీజీపీకి అతనితో సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. గత నాలుగేళ్లుగా నయీంతో సదరు డిజిపికి సంబంధాలు మరింతఎక్కువయ్యాయని తెలుస్తోంది.

ఐపీఎస్ వ్యాస్ హత్య నాటి నుంచే మాజీ డీజీపీతో నయీంకు సంబంధాలు ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. దర్యాఫ్తు బృందం నయీం డైరీలు, కాల్ లిస్టులు, ఫోన్ లిస్టు ఆధారంగా మొత్తం వివరాలు రాబట్టే ప్రయత్నాలు చేస్తోంది.

నయీంకు పలువురు ఐపీఎస్‌లు, పొలిటీషియన్లతో సంబంధాలు ఉన్నాయని గుర్తించారు. ఇదిలా ఉండగా గ్యాంగ్ స్టర్ నయీంను పోలీసులు నక్సలైట్ల ఏరివేతకు వాడుకున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నయీం సహకారం వృత్తి ధర్మంలో భాగంగా ఉపయోగించుకున్నట్లు కొందరు చెబుతున్నారు.

నయీం కేసు విచారణకు సిట్

నయీం కేసు విచారణకు సిట్

నయీం ఎన్‌కౌంటర్ అనంతరం అతనింట్లో, అతడికి సంబంధించిన వారి ఇళ్లలో సోదాలు చేస్తున్న కొద్దీ వేల ఎకరాల భూముల డాక్యుమెంట్లు బయటపడుతున్నాయి. వందల తుపాకులు, సెల్‌ఫోన్లు, సింకార్డులు వెలుగులోకి వస్తున్నాయి.

నయీం కేసు విచారణకు సిట్

నయీం కేసు విచారణకు సిట్

హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో స్థావరాలను ఏర్పాటుచేసుకొని అక్రమదందాలు సాగించిన నయీం వ్యవహారంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం మరింత లోతుగా దర్యాప్తు జరిపి నయీం ముఠాను కూకటివేళ్లతో పెకిలించాలన్న నిర్ణయం తీసుకుంది.

నయీం కేసు విచారణకు సిట్

నయీం కేసు విచారణకు సిట్

ఈ మేరకు రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ బుధవారం పోలీస్ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటుచేశారు. ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్‌రెడ్డి, జిల్లాల ఐజీ నాగిరెడ్డి, సీఐడీ ఐజీ సౌమ్యామిశ్రాలతో నయీం వ్యవహారం, దర్యాప్తు, యాక్షన్ ప్లాన్‌పై రెండు గంటలపాటు చర్చించారు.

నయీం కేసు విచారణకు సిట్

నయీం కేసు విచారణకు సిట్

అనంతరం, రాష్ట్రవ్యాప్తంగా వెలుగులోకి వచ్చిన నయీం కేసులు, దందాలపై పూర్తి స్థాయిలో విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు డీజీపీ ప్రకటించారు. ఐజీ నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఎనిమిది మంది అధికారులతో సిట్ పని చేస్తుందన్నారు.

నయీం కేసు విచారణకు సిట్

నయీం కేసు విచారణకు సిట్

ఇప్పటివరకు నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో, సైబరాబాద్ జంట కమిషనరేట్లలో నమోదైన కేసులను, సోదాల్లో బయటపడ్డ డాక్యుమెంట్లను సిట్‌కు బదిలీ చేస్తున్నట్లు చెప్పారు.

నయీంతో పోలీసులకు సంబంధాలు

నయీంతో పోలీసులకు సంబంధాలు

సిట్ బృందంలో.. వై నాగిరెడ్డి (నార్త్, వెస్ట్ జోన్ ఐజీ, సిట్ ఇంఛార్జ్), శ్రీనివాస్ రెడ్డి (అదనపు డీసీపీ, సైబరాబాద్ వెస్ట్), శ్రీధర్ (ఇన్స్‌పెక్టర్, బేగంబజార్), సుధాకర్ (ఇన్స్‌పెక్టర్, ఉప్పల్ ట్రాఫిక్), షకీర్ హుస్సేన్ (ఇన్స్‌పెక్టర్, వనపర్తి), రాజశేఖర రాజు (ఇన్స్‌పెక్టర్, కోరుట్ల, కరీంనగర్), సామల వెంకటేష్ (సిసిఎస్ ఇన్స్‌పెక్టర్, సంగారెడ్డి), మదుసూధన్ రెడ్డి (ఇన్స్‌పెక్టర్, కోదాడ), సీతారాం (ఇన్స్‌పెక్టర్ ఆర్మూర్ సర్కిల్).

నయీంతో పోలీసులకు సంబంధాలు

నయీంతో పోలీసులకు సంబంధాలు

నయీం ఒక మాజీ డీజీ, ఇద్దరు డీఎస్పీలు కొన్నేళ్ల నుంచి సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని గుర్తించారు. హైదరాబాద్‌లో ఉంటున్న మాజీ డీజీ, ఇద్దరు డీఎస్పీలు కొద్దినెలల క్రితం వరకూ కూడా సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది.

నయీంతో పోలీసులకు సంబంధాలు

నయీంతో పోలీసులకు సంబంధాలు

మాజీ డీజీ తన సొంత వ్యవహారాలను చక్కబెట్టుకునేందుకు అప్పుడప్పుడూ నయీం అనుచరులకు ఫోన్లు చేస్తుండగా.. డీఎస్పీలు మాత్రం నేరుగా నయీంతో మాట్లాడ్డంతో పాటు భూవివాదాలు, సెటిల్‌మెంట్ల గురించి చర్చించుకునేవారని సమాచారం. ఈ మేరకు ఇద్దరు డీఎస్పీల చరవాణుల నంబర్లను దర్యాప్తు అధికారులు సేకరించినట్టు తెలిసింది.

నయీంతో పోలీసులకు సంబంధాలు

నయీంతో పోలీసులకు సంబంధాలు

సదరు మాజీ డీజీ గతంలో ఓ రాజకీయ పార్టీ తరఫున పోటీచేసి ఓడిపోగా, ఇద్దరు డీఏస్పీల్లో ఒకరు నయీం సొంత జిల్లాలో నాలుగేళ్ల పాటు పనిచేసినట్టుగా తెలుస్తోంది. పోలీసులు మరిన్ని సాక్ష్యాధారాలు సేకరించే పనిలో పడ్డారు.

నయీం ఇంట్లో అత్యాధునిక ఆయుధాలు

నయీం ఇంట్లో అత్యాధునిక ఆయుధాలు

పోలీసుల సహకారంతోనే గ్యాంగ్ స్టర్‌గా ఎదిగిన నయీం... అనంతర కాలంలో పోలీసులకే పెను సవాల్‌గా మారాడు. ఏకంగా 15 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడని తెలుస్తోంది. అత్యాధునిక మారణాయుధాలతో పాటు అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన సమాచార సాధనాలను కూడా సముపార్జించుకున్నాడు. అలకాపురిలోని అతని ఇంటిలోని బెడ్ రూంను బుధవారం బద్దలు కొట్టిన పోలీసులకు.. అత్యాధునిక సైనైడ్ గన్‌తో పాటు శాటిలైట్ ఫోన్ కూడా దొరికింది.

నయీం ఇంట్లో తనిఖీలు

నయీం ఇంట్లో తనిఖీలు

రాజేంద్రనగర్‌ ఏసీపీ గంగారెడ్డి, నార్సింగి ఇన్స్‌పెక్టర్ రామచంద్ర రావు, చలపతిరావు సిబ్బందితో దాదాపు తొమ్మిది గంటలపాటు శ్రమించారు. నయీం బెడ్‌రూంలో ఏకే 47తోపాటు ఏపీ, తెలంగాణ, చత్తీస్ గఢ్, గోవా తదితర ప్రాంతాలకు సంబంధించిన భూముల డాక్యుమెంట్లు, ప్రామిసరీ నోట్లను గుర్తించారు. గుట్టలకొద్దీ ఉన్న వాటిని వేరు చేయటానికి పోలీసులకు మూడు గంటల సమయం పట్టిందని తెలుస్తోంది.

నయీం ఇంట్లో తనిఖీలు

నయీం ఇంట్లో తనిఖీలు

అలాగే, గదినిండా చెల్లాచెదురుగా పడేసిన వివిధ బ్రాండ్‌లకు చెందిన సుమారు 1000 రకాల దుస్తులు, బుర్ఖాలు, వేర్వేరు మోడల్స్‌లో 30 విగ్గులు, 5 మేకప్‌ కిట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. పది డిటోనేటర్లతోపాటు సైనైడ్‌ను, సైనెడ్ గన్‌ను కూడా పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. నయీం.. తనకు అండదండలు అందించిన పోలీసు అధికారులతో నయీం శాటిలైట్‌ ఫోనులోనే సంభాషించినట్లు అధికారులు భావిస్తున్నారు.

నయీం ఇంట్లో తనిఖీలు

నయీం ఇంట్లో తనిఖీలు

తనిఖీల సమయంలో నయీం ఇంట్లో దొరికిన డైరీలో పోలీసు అధికారులు, సిబ్బందితోపాటు రాజకీయ ప్రముఖులు, వ్యాపారులు, రియాల్టర్ల పేర్లతో పాటు 60 మందికిపైగా వివిధ పేపర్లు, రిపోర్టర్ల పేర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డైరీలోని ఆరు పేజీల్లో వారి పేర్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. వారిలో హైదరాబాద్‌, నల్గొండ జిల్లాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. అలాగే, దీర్ఘకాలిక వ్యాధులకు ఉపయోగించే పలు రకాల మందులను పోలీసులు గుర్తించారు.

English summary
Gangster Nayeem helped SIB but it was all professional, says former boss.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X