షాక్: పవన్ కళ్యాణ్ నిర్మాతను ముప్పుతిప్పలు పెట్టిన నయీం, కీలక మలుపులు
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీంకు సినిమా పరిశ్రమతోను లింకులు ఉన్నట్లుగా విచారణలో వెల్లడవుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఓ టీవీ ఛానల్ కథనం ప్రకారం.. నయీం పలువురు నిర్మాతలను బెదిరించి, డబ్బులు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్‌తో సినిమాలు తీసిన ఓ నిర్మాతను బ్లాక్ మెయిల్ చేసినట్లుగా సమాచారం.
నయీం బెదిరింపులకు భయపడిన సదరు నిర్మాత అతనికి రూ.8.5 కోట్లు ముట్టచెప్పినట్లుగా తెలుస్తోంది. నయీం దెబ్బకు సదరు నిర్మాత కొంతకాలం సినిమాలకే దూరమయ్యాడని తెలుస్తోంది. కిందిస్థాయి నుంచి వచ్చిన నిర్మాతలను నయీం ముప్పుతిప్పలు పెట్టాడని సమాచారం. అలాంటి నిర్మాతను కడా బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. సినిమాలు హిట్ అయితే, నిర్మాతకు ఎక్కువ వేధింపులు ఉండేవని తెలుస్తోంది.

నయీం కేసులో కీలక మలుపులు
నయీం కేసులో ఎన్నో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ప్రత్యేక దర్యాఫ్తు బృందం (సిట్) లోతుగా దర్యాఫ్తు చేస్తోంది. దర్యాఫ్తులో ఎన్నో కీలక మలుపులు కనిపిస్తున్నాయి. రోజుకో కొత్త కోణం కనిపిస్తోంది. నయీం కేసులో ఇద్దరు మాజీ ంత్రులు, ఎమ్మెల్సీ, ఓ బిజినెస్‌మెన్, ప్రొడ్యూసర్, ఐఏఎస్, ఐపీఎస్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. చోటామోటా నాయకులు, పోలీసుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
ఏపీకి చెందిన ఓ ఐఏఎస్ అధికారి ప్రత్యర్థులను మట్టుబెట్టేందుకు నయీంకు ఉపయోగించుకున్నాడని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తమ సమీప బంధువును నక్సలైట్లు హతమార్చడంతో.. నయీంతో వారిని మట్టుబెట్టించారని తెలుస్తోంది. మరోవైపు, ఓ తెలంగాణ అధికారి నయీం అనుచరుల పైన పీడీ యాక్టు పెట్టకుండా సహకరించాడని తెలుస్తోంది.
ఆ ముగ్గురు అనుచరులు ఒకేచోట!
నయీం ముఖ్య అనుచరుల్లో శేషన్న, జహంగీర్, రామయ్యలు ఉన్నారు. వీరు ముగ్గురు పరారీలో ఉన్నారు. వీరంతా ఒకేచోట ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. శేషన్న మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వాడు. ఇతనికి పోలీసులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications