డైరీ షాకింగ్: 63మంది జర్నలిస్ట్‌లు, నయీం వెనుక ఎవరెవరు?

హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం రాసుకున్న డైరీ కలకలం రేపుతోంది. నయీం ప్రతి అంశాన్ని తన డైరీలో రాసుకున్నారు. ఇప్పుడు అవి పోలీసుల చేతిలో ఉన్నాయి. ఈ డైరీలో 63 మంది జర్నలిస్టుల పేర్లు ఉన్నట్లుగా తెలుస్తోంది.

డైరీ ద్వారా నయీంకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి? అతను ఎవరెవరిని బెదిరించాడు? ఎవరి వద్ద నుంచి ఎన్ని డబ్బులు రాబట్టాడు? అనే వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ రోజు (బుధవారం) నయీం ఇంటిలో పోలీసులు మరోసారి సోదాలు జరపనున్నారు. తాళం వేసి ఉన్న గదిని పరిశీలిస్తారు.

అల్కాపురి కాలనీలోని నయీం ఇంట్లో జరిపిన సోదాల్లో పోలీసులకు కీలక వివరాలతో కూడిన ఓ డైరీ లభ్యమైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు వసూలు చేసిన మెుత్తం.. ఎక్కడెక్కడ ఆస్తులు కూడగట్టింది మొత్తం వివరాలను ఈ డైరీలో నయీం పొందుపరిచాడు.

పలువురు రాజకీయ ప్రముఖులతోపాటు, రియల్‌ఎస్టేట్‌, వ్యాపారులు నయీం లిస్ట్‌లో ఉన్నారని అంటున్నారు. కేసు దర్యాప్తులో ఈ డైరీ అత్యంత కీలకంగా మారనుందని చెబుతున్నారు. కాగా నయీంకు సహకరించిన వారిలో పోలీసు బాసులతో పాటు.. జర్నలిస్టులు కూడా ఉన్నారని అంటున్నారు.

నల్గొండ చెందిన 63 మంది జర్నలిస్టులకు కానుకలు ఇచ్చినట్లు డైరీలో నయీం రాసుకున్నాడు. వారికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దగ్గర ఉన్నట్లుగా సమాచారం. కొంతమంది పోలీసు అధికారులు, రాజకీయ వేత్తలకు సంబందించిన వివరాలు నయీం డైరీలో లభించాయి.

డైరీలో విస్తుగొలిపే విషయాలు: ఫర్హానా నయీం భార్య కాదన్న శంషాబాద్ డీసీపీ

డీఎస్పీ ఆపై స్థాయి, సినీ, రాజకీయ ప్రముఖుల బంధువులు స్థిరాస్తులకు సంబందించిన పత్రాలు దొరికాయని తెలుస్తోంది. హైదరబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, మెదక్‌, నల్లగొండ, ఏపీలో గుంటూరు జిల్లా చినకాకాని, నర్సరావుపేట తదితర ప్రాంతాలకు సంబందించిన కీలక పత్రాలు లభించాయి.

నయీం, అతని బంధువుల ఇళ్లలో జరిపిన సోదాల్లో భూములకు సంబంధించిన వందలాది డాక్యుమెంట్లు, లక్షల్లో నగదు, కంట్రీ మేడ్‌ తుపాకులు, జిలిటెన్‌స్టిక్‌, లైవ్‌ రౌండ్స్‌ పోలీసులకు లభమయ్యాయి. ఇవన్నీ గ్యాంగ్‌స్టర్‌ వ్యూహాత్మక రక్షణ చర్యలను స్పష్టం చేస్తున్నాయి.

Nayeem wanted to be buried beside brother

నయీం తన చేతికి వచ్చిన డాక్యుమెంట్‌ను పద్ధతి ప్రకారం సెట్‌ చేసేవాడట. డాక్యుమెంట్‌ ఏ ప్రాంతానికి సంబంధించింది, ఎంత విస్తీర్ణం, ఎవరి దగ్గర నుంచి వచ్చింది, ఎంత ఇచ్చాం, ఎంత ఇవ్వాలి.. తదితర వివరాలు ఉండేలా జాగ్రత్త తీసుకునే వాడంటున్నారు.

నయీం వెనుక ఎవరెవరు?

నయీం సహకరించిన బినామీల్లో ఎవరెవరు ఉన్నారన్న కోణంలో పోలీసు అధికార యంత్రాంగం దర్యాప్తు సాగిస్తోంది. నల్గొండ, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాలోని నయీం అనుచరులు, బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తూ అనుమానితులందరినీ అదుపులోకి సుకుంటున్నారు.

హైదరాబాద్‌లో ముంబై తరహా మాఫియా ఏర్పాటు చేసే ప్రయత్నంలో నయీం ఉన్నట్లు పోలీసుల దర్యాఫ్తులో వెలుగు వచ్చింది. పెద్దమొత్తంలో ఆయుధాలు, కోట్ల రూపాయల నగదుతోపాటు తాను టార్గెట్‌ చేసిన ప్రముఖుల వివరాల్ని తనిఖీల్లో పోలీసులు గుర్తించారు. కిడ్నాప్, బెదిరింపులు, బలవంతపు వసూల్లే కాదు అమ్మాయిల అక్రమ రవాణాకు కూడా నయీం పాల్పడినట్లు తెలుస్తోంది.

నయీం కేసు సిట్‌కు

నయీం కేసును సిట్‌కు అప్పగించాలని డిజిపి అనురాగ్ శర్మ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలతో ముడివడిన అంశం కాబట్టి దానిని సిట్‌కు అప్పగించాలని నిర్ణయించారు. కాగా, నయీం

హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం రాసుకున్న డైరీ కలకలం రేపుతోంది. నయీం ప్రతి అంశాన్ని తన డైరీలో రాసుకున్నారు. ఇప్పుడు అవి పోలీసుల చేతిలో ఉన్నాయి. ఈ డైరీలో 63 మంది జర్నలిస్టుల పేర్లు ఉన్నట్లుగా తెలుస్తోంది.

డైరీ ద్వారా నయీంకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి? అతను ఎవరెవరిని బెదిరించాడు? ఎవరి వద్ద నుంచి ఎన్ని డబ్బులు రాబట్టాడు? అనే వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ రోజు (బుధవారం) నయీం ఇంటిలో పోలీసులు మరోసారి సోదాలు జరపనున్నారు. తాళం వేసి ఉన్న గదిని పరిశీలిస్తారు.

అల్కాపురి కాలనీలోని నయీం ఇంట్లో జరిపిన సోదాల్లో పోలీసులకు కీలక వివరాలతో కూడిన ఓ డైరీ లభ్యమైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు వసూలు చేసిన మెుత్తం.. ఎక్కడెక్కడ ఆస్తులు కూడగట్టింది మొత్తం వివరాలను ఈ డైరీలో నయీం పొందుపరిచాడు.

పలువురు రాజకీయ ప్రముఖులతోపాటు, రియల్‌ఎస్టేట్‌, వ్యాపారులు నయీం లిస్ట్‌లో ఉన్నారని అంటున్నారు. కేసు దర్యాప్తులో ఈ డైరీ అత్యంత కీలకంగా మారనుందని చెబుతున్నారు. కాగా నయీంకు సహకరించిన వారిలో పోలీసు బాసులతో పాటు.. జర్నలిస్టులు కూడా ఉన్నారని అంటున్నారు.

నల్గొండ చెందిన 63 మంది జర్నలిస్టులకు కానుకలు ఇచ్చినట్లు డైరీలో నయీం రాసుకున్నాడు. వారికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దగ్గర ఉన్నట్లుగా సమాచారం. కొంతమంది పోలీసు అధికారులు, రాజకీయ వేత్తలకు సంబందించిన వివరాలు నయీం డైరీలో లభించాయి.

డీఎస్పీ ఆపై స్థాయి, సినీ, రాజకీయ ప్రముఖుల బంధువులు స్థిరాస్తులకు సంబందించిన పత్రాలు దొరికాయని తెలుస్తోంది. హైదరబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, మెదక్‌, నల్లగొండ, ఏపీలో గుంటూరు జిల్లా చినకాకాని, నర్సరావుపేట తదితర ప్రాంతాలకు సంబందించిన కీలక పత్రాలు లభించాయి.

నయీం, అతని బంధువుల ఇళ్లలో జరిపిన సోదాల్లో భూములకు సంబంధించిన వందలాది డాక్యుమెంట్లు, లక్షల్లో నగదు, కంట్రీ మేడ్‌ తుపాకులు, జిలిటెన్‌స్టిక్‌, లైవ్‌ రౌండ్స్‌ పోలీసులకు లభమయ్యాయి. ఇవన్నీ గ్యాంగ్‌స్టర్‌ వ్యూహాత్మక రక్షణ చర్యలను స్పష్టం చేస్తున్నాయి.

నయీం తన చేతికి వచ్చిన డాక్యుమెంట్‌ను పద్ధతి ప్రకారం సెట్‌ చేసేవాడట. డాక్యుమెంట్‌ ఏ ప్రాంతానికి సంబంధించింది, ఎంత విస్తీర్ణం, ఎవరి దగ్గర నుంచి వచ్చింది, ఎంత ఇచ్చాం, ఎంత ఇవ్వాలి.. తదితర వివరాలు ఉండేలా జాగ్రత్త తీసుకునే వాడంటున్నారు.

నయీం వెనుక ఎవరెవరు?

నయీం సహకరించిన బినామీల్లో ఎవరెవరు ఉన్నారన్న కోణంలో పోలీసు అధికార యంత్రాంగం దర్యాప్తు సాగిస్తోంది. నల్గొండ, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాలోని నయీం అనుచరులు, బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తూ అనుమానితులందరినీ అదుపులోకి సుకుంటున్నారు.

హైదరాబాద్‌లో ముంబై తరహా మాఫియా ఏర్పాటు చేసే ప్రయత్నంలో నయీం ఉన్నట్లు పోలీసుల దర్యాఫ్తులో వెలుగు వచ్చింది. పెద్దమొత్తంలో ఆయుధాలు, కోట్ల రూపాయల నగదుతోపాటు తాను టార్గెట్‌ చేసిన ప్రముఖుల వివరాల్ని తనిఖీల్లో పోలీసులు గుర్తించారు. కిడ్నాప్, బెదిరింపులు, బలవంతపు వసూల్లే కాదు అమ్మాయిల అక్రమ రవాణాకు కూడా నయీం పాల్పడినట్లు తెలుస్తోంది.

నయీం కేసు సిట్‌కు

నయీం కేసును సిట్‌కు అప్పగించాలని డిజిపి అనురాగ్ శర్మ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలతో ముడివడిన అంశం కాబట్టి దానిని సిట్‌కు అప్పగించాలని నిర్ణయించారు. కాగా, నయీం మృతదేహాన్ని నల్గొండ జిల్లాలోని ఆయన గ్రామంలో అతని సోదరుడి సమాధి పక్కనే పూడ్చిపెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+