కిరణ్‌రెడ్డి అడ్రస్ ఏది, మెచ్చుకుంటున్నారు: నాయిని
హైదరాబాద్: తెలంగాణ వస్తే ఈ ప్రాంతం అంధకారంలో మునిగిపోతుందని చెప్పిన నాటి ముఖ్యమంత్రి ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయాడని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు.
స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చూసి కాంగ్రెస్ పార్టీ పాదాల కింద వణుకు పుడుతోందన్నారు. అరవయ్యేళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో ఎప్పుడైనా హైదరాబాదులో చెత్త ఎత్తివేయాలనే ఆలోచన వచ్చిందా అని నిలదీశారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు మెచ్చుకుంటున్నారని చెప్పారు.
హైదరాబాద్ విశ్వకేంద్రం కావాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అవాకులు, చవాకులు పేలుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓ చెల్లని రూపాయి అయిందన్నారు. దానికి విలువ లేకుండా పోయిందన్నారు.

తాము ఇంటింటికి నల్లా ఇస్తామని మా ముఖ్యమంత్రి కేసీఆర్ ధైర్యంగా చెప్పారని, నల్లా ఇవ్వకుంటే మేం ఓట్లడగమని సవాల్ చేశారని, అలా చేసే ధైర్యం కాంగ్రెస్ నేతలకు ఉందా అని ప్రశ్నించారు.
తెలంగాణ వస్తే అంధకారమేనన్న నాటి సీఎం (కిరణ్ రెడ్డి) అడ్రస్ లేకుండా పోయారని, ఇప్పుడు తాము నిమిషం కూడా కరెంట్ పోకుండా ఇస్తున్నామన్నారు. మేం అధికారంలోకి వచ్చి ఏడాది కాలేదు అప్పుడే విమర్శలా అని ప్రశ్నించారు. హైదరాబాదును విశ్వనగరంగా చేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు.
ఏ భూమిని ఎలా వాడాలో కేసీఆర్‌కు తెలుసని మహమూద్ అలీ అన్నారు. గాంధీ భవన్లో కూర్చొని కాంగ్రెస్ నేతలు రెచ్చగొడుతున్నారన్నారు. ప్రజలంతా తెరాస పాలన పైన హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. భూకబ్జాదారులను శిక్షిస్తామన్నారు.












Click it and Unblock the Notifications