రేణుకా చౌదరిని మర్యాద పూర్వకంగానే కలిశా: ఎన్సీపీ అధినేత శరద్ పవార్

హైదరాబాద్: లోక కల్యాణం కోసం మెదక్‌జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ తలపెట్టిన అయుత మహా చండీయాగంలో పాల్గొనేందుకు నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద పవార్ శనివారం ఉదయం హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత నేత రేణుకా చౌదరితో శరద్ పవార్ ఆమె నివాసంలో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా రేణాక నివాసంలో శరద్‌పవార్‌తో కాంగ్రెస్‌ నేతలు టి. సుబ్బిరామిరెడ్డి, దానం నాగేందర్‌, మర్రి శశిధర్‌రెడ్డి, గీతారెడ్డి తదితరులు కలిశారు. అనంతరం శరద్ పవార్ మీడియాతో మాట్లాడుతూ రేణుకా చౌదరిని మర్యాదపూర్వకంగానే కలిశానని స్పష్టం చేశారు. సమావేశానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని తెలిపారు. కాగా సీఎం కేసీఆర్ ఎర్రవల్లిలో నిర్వహిస్తోన్న ఆయుత చండీయాగం నాలుగో రోజుకు చేరుకుంది.

NCP Leader Sharad Pawar meets congress leader renuka chowdary in hyderabad

యాగానికి నాలుగో రోజు పెద్ద ఎత్తున భక్తులతో పాటు పలువురు ప్రముఖులు సైతం హాజరయ్యారు. ఈరోజు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆయుత చండీయాగానికి హాజరయ్యారు. పవార్ యాగశాలకు చేరుకోగానే సీఎం కేసీఆర్ సతీసమేతంగా ఎదురెళ్లి ఆయనకు ఆహ్వానం పలికారు.

పుష్పగుచ్చం ఇచ్చి సాదరంగా స్వాగతం పలికారు. పవార్‌తోపాటు ఇతర నేతలు యాగశాలలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఇటీవలే ఢిల్లీకు వెళ్లిన సీఎం కేసీఆర్ శరద్ పవార్‌ నివాసానికి వెళ్లి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి, తాను నిర్వహించనున్న ఆయుత చండీయాగానికి ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

మధ్యాహ్న సమయంలో తమిళనాడు గవర్నర్‌ రోశయ్య, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, కాంగ్రెస్‌నేతలు సుబ్బిరామిరెడ్డి, గీతారెడ్డి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు, సినీ నటుడు రాజేంద్రప్రసాద్ తదితరులు హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+