పాలేరులో కోటీశ్వరుల పోరు - మారుతున్న లెక్కలు, గెలుపెవరిది..!!

తెలంగాణ ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. రెండు పార్టీల నుంచి ముఖ్య నేతలు బరిలో ఉన్ని నియోజకవర్గాల్లో పోట మరింత ఉత్కంఠ పెంచుతోంది. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న పాలేరులో ఇప్పుడు పోటీ నువ్వా నేనా అన్నట్లుగా మారుతోంది. పొంగులేటి - ఉపేందర్ రెడ్డి మధ్య హోరా హోరీ పోరులో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. పాలేరులో గెలిచేదెవరు.

పాలేరులో బిగ్ ఫైట్ : ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ఈ సారి బిగ్‌ ఫైట్‌ జరుగుతోంది. కేసీఆర్‌తో విభేదించి.. కాంగ్రెస్ లో చేరి.. ఖమ్మంలో కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపునకు క్రియాశీల పాత్ర పోషిస్తున్న పొంగులేటి పాలేరు బరిలో నిలవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు. పొంగులేటి, కందాల ఇద్దరూ రాజకీయాలతోపాటు నిర్మాణ సంస్థల అధిపతులు కావడంతో ఇద్దరూ గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.

Neck to Neck fight in Paleir Assembly constituency, Who will be the Winner

వీరితో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పోటీ పడుతున్నారు. ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన 16 ఎన్నికల్లో 12 సార్లు కాంగ్రెస్‌ పార్టీయే విజయం సాధించింది. 2016లో జరిగిన ఉప ఎన్నికలో మాత్రం టీఆర్‌ఎస్‌ తరఫున తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయం సాధించిన కందాల ఉపేందర్‌ రెడ్డి ఆ తర్వాత టీఆర్‌ఎస్ లో చేరి ఇప్పుడు బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మరోసారి బరిలోకి దిగారు.

పొంగులేటి శపధం : పొంగులేటి ఈ సారి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఒక్కరంటే ఒక్కరిని కూడా బీఆర్‌ఎస్‌ తరఫున గెలవనీయబోనని శపథం పట్టారు. కేసీఆర్‌ తీరుతోపాటు బీఆర్‌ఎస్‌ పాలనను ఎండగడుతున్నా రు. ఇక్కడ కాంగ్రెస్ కు బలమైన ఓటుబ్యాంకు ఉంది. గిరిజనులు తొలినుంచీ అండగా నిలుస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్దిగా ప్రస్తుతం బరిలో ఉన్న కందాల మొదట్లో నియోజకవర్గంలో వ్యతిరేకత వ్యక్తమైనా ఆ తర్వాత కందాల గుడులకు, బడులకు ఆర్థిక సాయం అందిస్తూ తనపై వచ్చిన వ్యతిరేకతను సానుకూలంగా మార్చుకున్నారు.

తాను స్థానికుడినని, తనను గెలిపిస్తే ఇక్కడే ఉండి సేవలందిస్తానని అంటున్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులంతా తనకే ఓటు వేస్తారని, దీనికితోడు, తాను వ్యక్తిగతంగా చేసిన సాయం ఓటు బ్యాంకుగా మారుతుందని ఆయన లెక్కలు వేసుకుంటున్నారు. గిరిజనులు సహాపార్టీకి బలమైన ఓటు బ్యాంకు.. సీపీఐ మద్దతు తనకు కలిసి వస్తుందని పొంగులేటి అంచనా వేస్తున్నారు.

Neck to Neck fight in Paleir Assembly constituency, Who will be the Winner

హోరా హోరీ పోరు : ఇక, ఈ సారి సీపీఎం నుంచి తమ్మినేని పోటీలో ఉన్నారు. పాలేరు నియోజకవర్గంలో 1983, 1985, 1994ల్లో జరిగిన ఎన్నికల్లో సీపీఎం విజయం సాధించింది.2009 ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

పొంగులేటి సర్వ శక్తులు పెట్టి గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. కందాలకు స్థానిక నేతగా గుర్తింపు కలిసొచ్చే అంశం. సీపీఎం ఏ మేర ఓట్లు చీలుస్తుందీ..ఎవరి ఓట్లకు గండి కొడుతుందనేది కీలకంగా మారుతోంది. అదే ఇప్పుడు ఈ ముగ్గురి అభ్యర్దుల్లు గెలుపును నిర్దేశించే అంశం కానుంది. దీంతో, హోరా హోరీ సాగే పాలేరు పోరులో గెలుపు ఎవరిని వరిస్తుంనేది ఆసక్తిగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+