వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీట్‌పై ఆర్డినెన్స్, ఏడాది వాయిదా: తెలుగు విద్యార్థులకు శుభవార్త

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్ర‌న్స్ టెస్ట్‌(నీట్‌)ను ఏడాది పాటు వాయిదా వేయాలని కేంద్రమంత్రి వర్గం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఆర్డినెన్స్ జారీ చేసింది. అంతకుముందే ఆర్డినెన్స్ జారీ చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు.

కేంద్రమంత్రి వర్గం ఇవాళ ప్రధాని కార్యాలయంలో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కేంద్రమంత్రి వ‌ర్గం గురువారం ఆర్డినెన్స్ (అత్య‌వ‌స‌ర ఆదేశం) జారీ చేసింది. రాష్ట్రాల నుంచి వ‌చ్చిన అభ్యంత‌రాల‌తో కేంద్రం పరిగణలోకి తీసుకుంది.

మెడిక‌ల్ కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం సుప్రీం ఆదేశాల మేర‌కు దేశ వ్యాప్తంగా నిర్వ‌హించ త‌ల‌పెట్టిన‌ నీట్‌ను ఏడాది పాటు వాయిదా వేస్తూ ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. రాష్ట్రాల అభ్యంత‌రాల‌పై ఢిల్లీలోని ప్ర‌ధాని కార్యాల‌యంలో చ‌ర్చించిన‌ కేంద్ర మంత్రి వ‌ర్గం చివ‌ర‌కు ఈ నిర్ణయం తీసుకుంది.

NEET issue: Centre passes ordinance deferring common medical entrance exam to next year

నీట్‌ను వ‌చ్చే ఏడాదికి వాయిదా వేయాలని, అలాగే ప్రాంతీయ భాష‌ల్లో నిర్వ‌హించాల‌ని ప‌లు రాష్ట్రాలు తీవ్రస్థాయిలో అభ్యంత‌రాలు వ్యక్తమైన విషయం తెలిసిందే.

తెలుగు విద్యార్థులకు ఊరట

నీట్ పరీక్ష ఏడాది పాటు వాయిదా వేయడంతో తెలుగు విద్యార్థులకు ఊరట లభిస్తుంది. ఏపీలో ఎంసెట్ ఫలితాల విడుదలకు మార్గం సుగమం అయింది.

అలాగే, తెలంగాణ మెడికల్ ఎగ్జామ్ పరీక్షలకు ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. మంత్రి లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు పరీక్షలకు ప్రిపేర్ కావాలని, ప్రవేశ తేదీని రేపు ప్రకటిస్తామని చెప్పారు. ఇది తెలుగు విద్యార్థులకు శుభవార్తే.

English summary
The Central government on Friday issued an ordinance or an executive order deferring the implementation of NEET or the National Eligibility cum Entrance Test the common entrance test for medical and dental courses - for state governments and their affiliated institutions to next year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X