రైలు టికెట్స్ కొంటారు కానీ రైలెక్కరు: ఎందుకో తెలిస్తే షాకవుతారు!!
టిక్కెట్టు కొనకుండా రైలు ఎక్కే వాళ్ళని చూసి ఉంటారు కానీ, ప్రతిరోజు టిక్కెట్ కొని రైలు ఎక్కకుండా ఉండే వాళ్ళని మీరు ఎక్కడైనా చూశారా? ఒకవేళ చూడకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నెక్కొండ రైల్వే స్టేషన్ కి రండి.. అక్కడ స్థానిక ప్రజలు ప్రతిరోజు రైలు టిక్కెట్లు కొంటారు కానీ ఒక్కరు కూడా రైలు ఎక్కరు.
అదేంటి టిక్కెట్లు కొనుగోలు చేసి కూడా రైలు ఎక్కక పోవడం అంటారా.. దీని వెనుక పెద్ద కథే ఉంది. మరి ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటో మీరు తెలుసుకోండి.ఉమ్మడి వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్ లో స్థానిక ప్రజలు ప్రతిరోజు అరవై టికెట్లు కొంటారు. కానీ ప్రయాణం చేయడానికి మాత్రం ఆ టికెట్లను ఉపయోగించరు. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.

నర్సంపేట నియోజకవర్గంలో ఒకేఒక్క రైల్వే స్టేషన్ నెక్కొండ. ఈ నియోజకవర్గం ప్రజలు ప్రయాణం చేయాలంటే ఈ రైల్వే స్టేషన్ నుండి మాత్రమే ప్రయాణం చేయాలి. అయితే ఇక్కడ చాలా రైళ్లకు హాల్టింగ్ పాయింట్ లేదు. తిరుపతి, హైదరాబాద్, ఢిల్లీ, షిర్డీ వంటి ముఖ్యమైన నగరాలకు వెళ్ళే రైళ్ళు కూడా ఇక్కడ ఆగవు.
దీని వలన స్థానికులు దూర ప్రయాణాలు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో దూర ప్రయాణాలు చేసే వారికి వరంగల్, కాజీపేట, సికింద్రాబాద్ వంటి స్టేషన్లకు వెళ్లి రైలు ఎక్కవలసి వస్తుంది. అయితే స్థానికులు రైల్వే అధికారులకు తమ గోడును చాలాసార్లు వెళ్లబోసుకున్నారు.
దీంతో సికింద్రాబాద్ గుంటూరు ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ కు టెంపరరీ హాల్టింగ్ ఇచ్చారు. మూడు నెలపాటు ఈ హాల్టింగ్ పాయింట్ లో ఆదాయం వస్తేనే పూర్తి స్థాయిలో హాల్టింగ్ కల్పిస్తామని లేకపోతే రద్దు చేస్తామని కండిషన్ పెట్టడంతో రైల్వే అధికారులు తాత్కాలికంగా ఇచ్చిన హాల్టింగ్ ను పర్మినెంట్ చేసుకోవడం కోసం స్థానికులు ప్రతిరోజు టికెట్లు కొనుగోలు చేస్తున్నారు.
నెక్కొండ పట్టణ రైల్వే టికెట్స్ ఫోరం పేరుతో వాట్సాప్ గ్రూప్ ని పెట్టి అందులో సుమారు 400 మంది చేరి విరాళాల రూపంలో 25000 రూపాయలు సమకూర్చుకొని ఈ డబ్బుతో ప్రతిరోజు టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. నెక్కొండ నుండి ఖమ్మం, సికింద్రాబాద్, గుంటూరు తదితర ప్రాంతాలకు వెళ్ళినట్టు ట్రైన్ టికెట్లు కొంటున్నారు. తమ టెంపరరీ హాల్టింగ్ పాయింట్ ను పర్మినెంట్ చేసుకోవడానికి ఆ స్టేషన్ కి తమ టికెట్లు కొనుగోలు ద్వారా ఆదాయాన్ని చూపిస్తున్నారు.












Click it and Unblock the Notifications