Nepal floods: నేపాల్ వరదల్లో చిక్కుకున్న 23 మంది తెలంగాణ వాసులు

నేపాల్ లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మొత్తం 288 మంది భారతీయులు గల్లంతైనట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ కొద్దిసేపటి క్రితమే వెల్లడించింది. ఈ మేరకు బాధితులకు, వారి కుటుంబాలకు సాయం అందించేందుకు కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. అయితే నేపాల్ వరదల్లో తెలంగాణకు చెందిన 23 మంది చిక్కుకున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి తెలిపారు. నేపాల్‌ లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 23 మంది చిక్కుకున్నట్లు గుర్తించామని.. వారి వివరాలు విదేశాంగ శాఖకు పంపించామని తెలిపారు. ఈ మేరకు నేపాల్ వరదల పరిస్థితులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

నేపాల్ వరదల్లో చిక్కుకున్న 23 మందిలో ఆరుగురు రాష్ట్ర వాసులు కాగా.. మిగిలిన 17 మంది ప్రవాస తెలంగాణకు చెందిన వారని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. అలాగే రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ పర్యాటకుడు సురక్షితంగా ఉన్నట్లు తెలిసిందని పేర్కొన్నారు. మిగతా 22 మంది ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ మేరకు కేంద్రం, నేపాల్‌ లోని రాయబార కార్యాలయంతో సమన్వయం చేస్తున్నట్లు వెల్లడించారు. దేశ రాజధాని దిల్లీ, హైదరాబాద్ ‌లో హెల్ప్‌ లైన్‌, కోఆర్డినేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు.

దిల్లీలో హెల్ప్‌ లైన్ నంబర్లు ఇలా ఉన్నాయి.. 9871999044, 9949351270, 9618597969.. అలాగే సచివాలయంలో హెల్ప్‌ లైన్ నంబర్లు ఇలా ఉన్నాయి.. 9885371189, 7997959754, 9440854433. ఇక నేపాల్‌ లో వరదల్లో చిక్కుకున్న తెలంగాణ పౌరుల సహాయం కోసం సచివాలయంలోని GAD-NRI ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.. బాధితుల సమాచారం కోసం ఎస్. లక్ష్మీనారాయణ (అసిస్టెంట్ సెక్రటరీ): 9885371189.. కే. శ్రీనివాస్ రెడ్డి (సెక్షన్ ఆఫీసర్): 7997959754.. ఈ చిట్టిబాబు (సెక్షన్ ఆఫీసర్): 9440854433 నెంబర్లను అందుబాటులో ఉంచింది.

Nepal flash floods 23 people from Telangana stranded in Nepal floods Minister Ponguleti reveals

వీరితోపాటు దిల్లీలోని తెలంగాణ భవన్‌ లో హెల్ప్‌ లైన్, కోఆర్డినేషన్ సెంటర్ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. హెల్ప్‌ లైన్: రెసిడెంట్ కమిషనర్ పీఎస్‌, వందన 9871999044, హెల్ప్‌ లైన్: పీఆర్ ఓ చక్రవర్తి నంబర్ 9949351270.. హెల్ప్‌ లైన్: లైజన్ ఆఫీసర్ జీ. రక్షిత్ నాయక్ నంబర్ 9618597969

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+