కుక్కల పంచాయితీ... యాంకర్ రష్మీపై యాసిడ్ పోస్తామని బెదిరింపులు, రష్మీ ఏమందంటే!!
హైదరాబాద్‌లో కుక్కల ఘటనపై ట్వీట్ చేసిన రష్మీపై నెటిజన్ లు ట్రోల్ చేస్తున్నారు. నిన్న ఓ నెటిజన్ రష్మీని కుక్కతో పోలిస్తే, తాజాగా రష్మీపై యాసిడ్ పోస్తానని బెదిరించాడు. దీనిపై రష్మీ స్పందించింది.
ఎక్స్ ట్రా జబర్దస్త్ అంటూ యాంకర్ గా రాణిస్తున్న రష్మీ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఆగడం లేదు. బుల్లితెరపై ఎంతో క్రేజ్ ఉన్న రష్మి గౌతమ్ తనదైన మాట తీరుతో, అందచందాలతో టాప్ యాంకర్లలో ఒకరిగా నిలిచారు. అప్పుడప్పుడు వెండితెర పైన కూడా మెరుస్తున్న ఈ బ్యూటీ టెలివిజన్లో అనేక షోలతో పాటు, సినిమాలలోనూ నటిస్తూ బిజీగా మారారు. ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మీ గౌతమ్ ను ప్రస్తుతం నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.

రష్మీని తిట్టిపోస్తున్న నెటిజన్ లు .. ఎందుకంటే
అసలు రష్మీ వివాదం ఏమిటి ? ఎందుకు రష్మీని ఇంతగా జనాలు తిట్టిపోస్తున్నారు? అంటే ఇటీవల హైదరాబాద్ లో వీధి కుక్కల దాడి ఘటనలో నాలుగేళ్ల బాలుడు చనిపోయిన విషయం తెలిసిందే. ఇక ఈ ఘటన పైన స్పందించిన రష్మి గౌతమ్ వీధి కుక్కలు దాడి చేసిన ఘటన పై ఆవేదన వ్యక్తం చేస్తూనే, కుక్కలు కూడా మనలాగా ప్రాణులని, వాటికి ప్రత్యేకంగా వసతి కల్పించాలంటూ ట్వీట్ చేశారు.

కుక్కను కొట్టినట్టు రష్మీని కొట్టాలన్న నెటిజన్.. రష్మీ ఛాలెంజ్
ఇక రష్మి గౌతమ్ చేసిన ట్వీట్ నెటిజన్ ల అగ్రహానికి కారణంగా మారింది. దీంతో రష్మి గౌతమ్ ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్ లు. ఒక నెటిజన్ అయితే ఏకంగా రష్మీ గౌతమ్ ని కుక్కతో పోల్చి ఈ కుక్క రష్మీని కుక్కను కొట్టినట్టు కొట్టాలి అంటూ ఆమె ట్వీట్ పై కామెంట్ చేశారు. దీంతో అసహనానికి గురైన రష్మి గౌతమ్ తప్పకుండా నీ అడ్రస్ చెప్పు.. నేనే వచ్చి నిన్ను కలుస్తా.. ఎలా కొడతావో నేను చూస్తా.. ఇదే నీకు నా చాలెంజ్ అంటూ సవాలు విసిరారు.

బయట తిరగొద్దు అంటూ రష్మీకి బెదిరింపులు
ఇక ఇదే సమయంలో కొందరు రష్మీ గౌతమ్ ఫై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ విరుచుకుపడుతున్నారు. మూగజీవాల తరఫున మాట్లాడుతున్న రష్మీకి నాలుగేళ్ల బాలుడి ప్రాణాలు పోతుంటే మానవత్వం ఎటు పోయింది అంటూ మండిపడుతున్నారు. రష్మి గౌతమ్ బయట తిరగొద్దంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. నువ్వు బయట తిరిగితే నీ మీద యాసిడ్ పోస్తామంటూ హెచ్చరిస్తున్నారు.

పాపిష్టిదానా... బయటకు వస్తే యాసిడ్ పోస్తాం : నెటిజన్ వార్నింగ్
ఇక రీసెంట్ గా ఒక నెటిజన్ ఆమెపై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. నువ్వు ఇంట్లోనే ఉండు పాపిష్టిదానా.. బయటకు వస్తే యాసిడ్ పోస్తాం.. చేతబడి చేయిస్తామంటూ చేసిన వ్యాఖ్యలను రష్మీ పోస్ట్ చేశారు. ఆవుల వల్ల రోడ్లమీద యాక్సిడెంట్లు అవుతాయా.. యాసిడ్ పోస్తా.. వాటి గురించి నీలాంటి పాపిష్టి వాళ్ళకి తెలీదు అన్నీ మూసుకుని ఉండు.. మొండిగా ప్రవర్తిస్తే కష్టాల్లో పడతావ్ అంటూ ఓ నెటిజన్ పోస్ట్ పెట్టారు.

ఫిర్యాదు చెయ్యాలా ? వద్దా? అంటూ రష్మీ ట్వీట్
దీంతో రష్మీ గౌతమ్ ఈ అకౌంట్ ఎవరిదో తనకు తెలియదు కానీ నాపై యాసిడ్ పోస్తామని, చేతబడి చేస్తామని బెదిరిస్తున్నారు. మరి ఇలాంటి వారిపై నేను ఫిర్యాదు చేయాలా వద్దా అంటూ ప్రశ్నించారు. ఇక రష్మీ గౌతమ్ కి కొందరు మద్దతుగా నిలిచి ఫిర్యాదు చేయాలని సూచిస్తుంటే, కొందరు లైట్ తీసుకోమని సలహా ఇస్తున్నారు. కుక్కల పంచాయితీతో మొదలైన రష్మీ వివాదం ఇప్పటికే చిలికి చిలికి గాలి వాన కాగా ముందు ముందు మరే ఇతర మలుపు తీసుకుంటుందో వేచి చూడాలి.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications