మంచు ఫ్యామిలీలో గొడ‌వ‌ల వేళ..షాకింగ్ పోస్ట్ షేర్ చేసిన మంచు ల‌క్ష్మీ

మంచు మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. మోహన్ బాబు ఆయన చిన్న కొడుకు మంచు మనోజ్ మధ్య గొడవలు ఏర్పడ్డాయి. దీంతో మంగళవారం రాత్రి జలపల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది తనపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని, తనకు తన భార్యకు ప్రాణహాని ఉందని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే మోహన్ బాబు సైతం కొడుకు నుంచి తనకు ప్రాణహాని ఉందని రాచకొండ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

దీంతో మంచు మనోజ్‌పైన ఆయన భార్య మౌనికపైన పోలీసులు కేసు నమోదు చేశారు.మోహన్ బాబు ఇంటి చుట్టూ విష్ణు 40 మంది బౌన్సర్లను పెడితే.. మనోజ్‌ 30 మంది బౌన్సర్లను దింపాడు. దీంతో మోహన్ బాబు ఇంటివద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. మంగళవారం రాత్రి జలపల్లిలోని మంచు టౌన్‌కు మంచు మనోజ్ దంపతులు చేరుకున్నారు. మంచు మనోజ్ వాహనాన్ని గేట్ దగ్గరే బౌన్సర్లు ఆపేశారు.

Netizens are outraged by Manchu Lakshmi s post

ఈ విషయం తెలుసుకున్న మీడియా అక్కడకు భారీగా చేరుకుంది. లోపలకి వెళ్లిన మీడియాపై మోహన్ బాబు దాడి చేశారు.మీడియా పై మోహన్ బాబు అరాచకం సృష్టించారు. సహనాన్ని కోల్పోయిన మోహన్ బాబు విచక్షణా రహితంగా మీడియా పై దాడి చేశారు.మైక్ లాగి మరీ మీడియా ప్రతినిధిపై ఆయన దాడి చేశారు. ఈ ఘటనలో సదరు మీడియా ప్రతినిధికి గాయాలు అయ్యాయి. ఆ తర్వాత బీపీ డౌన్ అవ్వడంతో మోహన్ బాబు ఆస్పత్రిలో చేరారు.

మంచు కుటుంబంలో ఇన్ని వివాదాలు నడుస్తోన్న సమయంలో మంచు లక్ష్మీ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో కూతురి వీడియోను పోస్ట్ చేసి పీస్ అంటూ మాత్ర‌మే రాసుకొచ్చింది. దీంతో మంచు లక్ష్మీ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. తండ్రీ, అన్న‌ద‌మ్ముల మ‌ధ్య ఇంత జ‌రుగుతుంటే వారి మధ్య స‌యోధ్య కుదిర్చే ప్ర‌య‌త్నం చేయ‌కుండా ఇన్‌స్టాపోస్ట్‌ల‌తో బీజీగా ఉంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+