తెలంగాణ రాజ్ భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం..
తెలంగాణ వ్యాప్తంగా గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన కేబినెట్ విస్తరణకు తెర పడింది. రాజ్‌భవన్‌లో నూతన మంత్రులుగా గడ్డం వివేక్ వెంకట స్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వారితో ప్రమాణం చేయించగా.. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులు పాల్గొన్నారు. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యం ఇస్తూ వీరిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
దీనిలో భాగంగానే ఎస్సీల నుంచి వివేక్ (మాల), అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ (మాదిగ), బీసీల నుంచి వి.శ్రీహరి ముదిరాజ్‌కు అవకాశం కల్పించారు. వివేక్, లక్ష్మణ్ చేరికతో కేబినెట్‌లో దళిత మంత్రుల సంఖ్య నాలుగుకి చేరింది. అలానే కాంగ్రెస్ నుంచి గెలిచిన ఏడుగురు బీసీల్లో ముగ్గురికి మంత్రి పదవులు దక్కడం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక శాసన సభలో ఉప సభాపతి బాధ్యతలు రామచంద్రు నాయక్ స్వీకరించారు. డోర్నకల్ నుంచి తొలిసారి గెలిచిన రామచంద్రునాయక్‌కి డిప్యూటీ స్పీకర్ బాధ్యతలు ఇవ్వడం కూడా హాట్ టాపిక్ అవుతోంది.

కొత్త మంత్రుల పొలిటికల్ జర్నీ..
మంత్రి గడ్డం వివేక్ రాజకీయ ప్రస్థానం:
గడ్డం వివేక్‌కు రాజకీయ వారసత్వం అందినట్లే. ఆయన తండ్రి వటపర్తి వెంకటస్వామి (కాకా) బాటలోనే ఆయన రాజకీయం ప్రారంభమైంది. 2009లో పెద్దపల్లి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అనంతరం తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో, 2013లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తిరిగి కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. 2016లో మరోసారి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. రాజకీయాలతో పాటు క్రీడా రంగంలో కూడా చురుగ్గా ఉన్న ఆయన 2017లో హెచ్‌సీఏ (హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2019లో బీజేపీలో చేరి జాతీయ స్థాయిలో సేవలందించారు. చివరకు 2023 నవంబర్‌లో మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి చేరి చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచి, ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా పదవి చేపట్టారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ రాజకీయ ప్రస్థానం:
ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కు విద్యార్థి రాజకీయాల నుంచే బలమైన ప్రస్థానం ఉంది. 1982లో గోదావరిఖని జూనియర్ కళాశాలలో ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా ఆయన రాజకీయ పయనం ప్రారంభమైంది. అనంతరం ఎన్‌ఎస్‌యూఐ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ యువ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1999లో తొలిసారి మేడారం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. జెడ్‌పీటీసీగా ధర్మారం ప్రాతినిధ్యం వహించి, 2010-2012లో కరీంనగర్ జెడ్‌పీ చైర్మన్‌గా సేవలందించారు. 2009, 2010, 2014, 2018లో ధర్మపురి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పొందారు. చివరకు 2023 ఎన్నికల్లో గెలిచి శాసనసభకు ఎంపికై, ఇప్పుడు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Swearing-in Ceremony of Telangana Cabinet Ministers at Raj Bhavan,Hyderabad https://t.co/ACU85DszXT
— Telangana Congress (@INCTelangana) June 8, 2025
మంత్రి వాకిటి శ్రీహరి రాజకీయ ప్రస్థానం:
మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి రాజకీయాల్లో అడుగుపెట్టింది 1990లో, ఎన్‌ఎస్‌యూఐ మక్తల్ అధ్యక్షుడిగా. ఆ తర్వాత 1993-96 మధ్య మక్తల్ మండల యువ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, 1996-2001లో మండల కాంగ్రెస్ సెక్రటరీగా పనిచేశారు. 2001లో మక్తల్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2001-06 మధ్య మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్‌గా సేవలందించారు. తర్వాత నారాయణపేట డీసీసీ ప్రెసిడెంట్‌గా కూడా పనిచేశారు. 2023లో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి, కేబినెట్ మంత్రి పదవికి ఎదిగారు.
-
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ?












Click it and Unblock the Notifications