అన్న రికార్డు బ్రేక్ చేసిన షర్మిల - కీలక నిర్ణయం..!!
వైఎస్ షర్మిల తన అన్న జగన్ పేరున ఉన్న రికార్డును బ్రేక్ చేసారు. కీలక ప్రకటనకు సిద్దం అవుతున్నట్లు సమాచారం.
వైఎస్ షర్మిల కొత్త రికార్డు దిశగా అడుగులు వేస్తున్నారు. షర్మిల చేస్తున్న సుదీర్ఘ పాదయాత్ర ముగింపు దశకు వచ్చింది. తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపించటమే తన లక్ష్యమని షర్మిల నినదించారు. దాదాపు ఏడాదిన్నార కాలం పాదయాత్ర చేసిన షర్మిల మార్చి 5న ముగింపు దిశగా నిర్ణయించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిల ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీకి నిర్ణయించారు. పాలేరులోనే పాదయాత్ర ముగింపు సభకు నిర్ణయం తీసుకున్నారు. అయితే..ఈ యాత్ర సమయంలో షర్మిల తన అన్న జగన్ పేరున ఉన్న రికార్డును బ్రేక్ చేసారు. అక్కడే కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఇక..పాలేరు కేంద్రంగా షర్మిల కీలక ప్రకటనకు సిద్దం అవుతున్నట్లు సమాచారం.

అన్ని రికార్డును అధిగమించి..ముందుకు
వైఎస్ కుటుంబంలో పాదయాత్రలకు ప్రత్యేకత ఉంది. నాడు వైఎస్సార్.. జగన్..ఇప్పుడు షర్మిల. కొత్త రికార్డులను సృష్టించారు. తెలుగు రాష్ట్రాల్లో వైఎస్సార్ పాదయాత్ర 2004లో ముఖ్యమంత్రిని చేసింది. 2019 లో జగన్ తన సుదీర్ఘ పాదయాత్రతో ఏపీ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు షర్మిల పాదయాత్ర పూర్తవుతోంది. గతంలో వైసీపీ కోసం షర్మిల ఉమ్మడి రాష్ట్రంలోనూ పాదయాత్ర చేసారు. తెలంగాణలో పార్టీ స్థాపించి..ప్రత్యర్ధి పార్టీలను టార్గెట్ చేసిన షర్మిల తన పాదయాత్రలో తన అన్న జగన్ పేరున ఉన్న రికార్డును బ్రేక్ చేసారు. జగన్ తన పాదయాత్రలో మొత్తం 3,648 కిలో మీటర్లు 341 రోజుల్లో పూర్తి చేసారు. ఇప్పుడు షర్మిల మార్చి 5వ తేదీన తన పాదయాత్రను పాలేరు ముగించనున్నారు. సరిగ్గా 4,111 కిలో మీటర్ల మైలు రాయి వద్ద తన పాదయాత్ర ముగించేలా షర్మిల నిర్ణయించారు.

జగన్ - షర్మిల యాత్రల్లో ఇలా
జగన్ తన పాదయాత్ర ద్వారా దాదాపు రెండు కోట్ల మంది ప్రజలకు దగ్గరయ్యారు. మొత్తం ఏపీలోని నాటి 13 జిల్లాల్లోనూ యాత్ర కొనసాగింది. 2017 నవంబర్ 6న ఇడుపులపాయలో ప్రారంభమైన యాత్ర.. 2019 జనవరి 10న ఇచ్ఛాపురంలో ముగిసింది. షర్మిల తన పాదయాత్ర 2021 అక్టోబర్ 20న ప్రారంభించారు. దాదాపుగా ఏడాదిన్నార కాలం షర్మిల పాదయాత్ర ముగిసింది. మధ్యలో ఎన్నికల కోడ్, విదేశీ పర్యటన, పోలీసుల అనుమతి నిరాకరణ, ఇతర కారణాలతో విరామం వచ్చింది. ఈ నెల 20న పాలేరులో షర్మిల పాదయాత్ర ప్రవేశించనుంది. 14 రోజుల పాటు తాను పోటీ చేయాలని డిసైడ్ అయిన పాలేరులో షర్మిల పాదయాత్ర కొనసాగనుంది. పాలేరు నియోజకవర్గం కూసుమంచిలో మార్చి 5న ముగింపు సభకు నిర్ణయించారు. ఏపీలో ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ టార్గెట్ 4 వేల కిలో మీటర్లుగా నిర్ణయించారు.
ముగింపు సభలో కీలక ప్రకటన
మరో పది నెలల కాలంలో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో షర్మిల ఇప్పటి వరకు పార్టీ నిర్మాణం పైన పూర్తిగా ఫోకస్ చేయలేదు. ఎన్నికల వేళ పార్టీ వ్యూహాలు..అభ్యర్ధుల ఎంపిక దిశగా కసరత్తు దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే టచ్ లోకి వచ్చిన కొందరు నేతలు పాలేరు పాదయాత్ర ముగింపు వేదికగా పార్టీలో చేరుతారని సమాచారం. అయితే షర్మిల బీజేపీతో పొత్తు ఉంటుందని బీఆర్ఎస్ నేతలు గతంలో ఆరోపించారు. ఈ ప్రచారాన్ని షర్మిల ఖండించారు. ఇక..బీఆర్ఎస్ వర్సస్ బీజేపీగా మారిన తెలంగాణ రాజకీయంలో గట్టి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. మరి..ఈ సమయంలో పొత్తులు లేకుండానే షర్మిల ఎన్నికల బరిలోకి దిగుతారా..లేక.. పొత్తుల పైన ఏమైనా నిర్ణయాలు ఉంటాయా అనేది పాలేరు సభ వేదికగా షర్మిల తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
-
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..?












Click it and Unblock the Notifications