ట్విస్ట్: ఏఎస్సై మోహన్ రెడ్డితో సంబంధాలున్న డిఎస్పీలకు పోస్టింగ్‌లు
కరీంనగర్: వడ్డీ వ్యాపారిగా మారి అక్రమ దందాలు, బెదిరింపులకు పాల్పడి రూ.కోట్లు సంపాదించిన ఏఎస్సై మోహన్ రెడ్డి కేసులో దర్యాఫ్తు ఓ వైపు కొనసాగుతుండగా, మరోవైపు అతనితో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు పోస్టింగులు వచ్చాయి.
అతనితో సంబంధాలు ఉన్నాయని పలువురు డీఎస్పీలు, ఏసీపీలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వడ్డీ వ్యాపారంలో పెట్టుబడుల కోసం తనకు కొందరు డిఎస్పీలు, ఏసీపీలు డబ్బులు ఇచ్చారని ఏఎస్సై మోహన్ రెడ్డి పేర్లు చెప్పారు.

వెంటనే వారి పైన క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. డిజిపి కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ముగ్గురు డిఎస్పీలను బదలీ చేశారు. ఏఎస్సై మోహన్ రెడ్డి వాంగ్మూలం ఆధారంగా దర్యాఫ్తు బాధ్యతను సిఐడికి అప్పగించారు. దీనిపై దర్యాఫ్తు కొనసాగుతోంది.
మోహన్ రెడ్డికి సహకరించిన కీలక నిందితుడు జ్ఞానేశ్వర్ సహా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నారు.
ఏఎస్సై మోహన్ రెడ్డి చెప్పిన పోలీస్ అధికారుల పేర్ల ఆధారంగా విచారణ ప్రారంభించారు. ఇదిలా ఉండగానే మరోవైపు, ఆరోపణలు ఎదుర్కొంటున్న డిఎస్పీలకు ఇద్దరికి పోస్టింగులు వచ్చాయి. వారు తప్పించుకునేందుకు ప్రజాప్రతినిధులను ఆశ్రయించినందు వల్లే పోస్టింగులు వచ్చాయని తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications