వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

న్యూ ఇయర్ తోఫా: రిజిస్ట్రేషన్ నెంబర్ లేకుండా వాహనం నడిపితే ఇకపై చీటింగ్ కేసులు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తరువాత కఠినంగా ట్రాఫిక్ నిబంధనలు అమలు చేస్తున్న వరంగల్లో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారికి ఇకపై చుక్కలు చూపించడానికి రెడీ అయ్యారు వరంగల్ కమిషనరేట్ పోలీసులు. కొత్త సంవత్సర కానుకగా కొత్త నిర్ణయం తీసుకున్నారు. రిజిస్ట్రేషన్ నెంబర్ లేకుండా వాహనం నడిపితే ఇక పై చీటింగ్ కేసులు నమోదు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి రంగనాథ్ ఆదేశించారు. దీంతో ఇకనుండి రిజిస్ట్రేషన్ లేకుండా వాహనం నడిపే వాహనదారులపై కేసులు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు వరంగల్ ట్రాఫిక్ పోలీసులు.

జనవరి 1 నుండి సరికొత్త డ్రైవ్

జనవరి 1 నుండి సరికొత్త డ్రైవ్


వరంగల్ ట్రై సిటీస్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించే వాహనదారులను కట్టడి చేయడంతో పాటు, చోరీ చేసిన వాహనాలను గుర్తించడంలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వినూత్న డ్రైవ్ కు తెరతీశారు. ఇందులో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వచ్చే జనవరి ఒకటవ తేదీ నుండి నంబర్ లేకుండా వాహనం నడిపే వాహనదారులపై చీటింగ్ కేసులు నమోదు చేయబడతాయి. అంతేకాదు ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వాహనంపై ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ ను ఏర్పాటు చేసినా సరే చీటింగ్ కేసు నమోదు కావటం పక్కా .

వాహనాలు నడిపేవాళ్ళు ఈ పనులు చేస్తే చీటింగ్ కేసులు పక్కా

వాహనాలు నడిపేవాళ్ళు ఈ పనులు చేస్తే చీటింగ్ కేసులు పక్కా

ఉద్యేశపూర్వంగా వాహన రిజిస్ట్రేషన్ నంబర్ ను మార్పు చేసినా , నంబర్లపై స్టిక్కర్లుగాని, నంబర్ ప్లేట్ కనిపించకుండా మాస్కులను కానీ తగిలించినా , నంబర్ ప్లేట్ ను వంచినా కూడా వాహనదారులపై కూడా ఛీటింగ్ కేసులను నమోదు చేయబడతాయని పేర్కొన్నారు. చాలామంది వాహనదారులు రవాణా శాఖ రిజిస్ట్రేషన్ నెంబర్ కేటాయించినప్పటికీ, దానిని వాహనంపై వేయకుండా తిరుగుతున్నారని, అటువంటి వాహనదారులపై కూడా ఛీటింగ్ కేసులను నమోదు చేయబడుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు.

ట్రాఫిక్ రూల్స్ విషయంలో మరింత కఠినంగా

ట్రాఫిక్ రూల్స్ విషయంలో మరింత కఠినంగా


మొత్తంగా చూస్తే వరంగల్ నగరంలో ట్రాఫిక్ రూల్స్ విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడినా, ట్రిపుల్ రైడింగ్ చేస్తూ దొరికినా కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎక్కడికక్కడ కెమెరాలతో క్లిక్కుమనిపించి ఫైన్ లు ఇళ్ళకు పంపిస్తున్నారు. ఇక తాజాగా ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు చెయ్యటంలో భాగంగానే వరంగల్ లోనూ వాహనాలపై నెంబర్ లేకుండా వాహనం నడిపితే వాహనదారులపై చీటింగ్ కేసు నమోదు చేయబడతాయని షాకింగ్ నిర్ణయం తీసుకుని వరంగల్ పోలీస్ కమిషనర్ వాహనదారులను హెచ్చరిస్తున్నారు. ఇక తాజా హెచ్చరికలతో వాహనదారులు జరభద్రం..!!

హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వ్యాఖ్యల వివాదం.. సస్పెండ్ చెయ్యకుంటే వదిలిపెట్టం - హిందూసంఘాల అల్టిమేటం!!హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వ్యాఖ్యల వివాదం.. సస్పెండ్ చెయ్యకుంటే వదిలిపెట్టం - హిందూసంఘాల అల్టిమేటం!!

English summary
Warangal Police Commissioner A.V.Ranganath said that cheating cases on the motorists registered who drive the vehicles without registration numbers. This rule will come into force from January 1st.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X