తెలంగాణలో భారీగా పెరుగుతోన్న డిశ్చార్జీలు: స్థిరంగా యాక్టివ్ కేసులు: 2,200 మందికి పైగా

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యధాతథంగా కొనసాగుతున్నాయి. రోజువారీ కొత్త కేసులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వైరస్ టెస్టింగులకు అనుగుణంగా రోజువారీ కేసుల సంఖ్యలో మార్పులు, చేర్పులు కనిపిస్తున్నాయి. అలాగే- కరోనా నుంచి కోలుకుంటోన్న వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. యాక్టివ్ కేసుల సంఖ్యలో స్థిరత్వం కొనసాగుతోంది. ఎప్పట్లాగే- గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో వైరస్ కేసుల తీవ్రతా కొనసాగుతోంది.

తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,216 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 11 మంది మరణించారు. 2,603 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,57,096కు చేరుకుంది. ఇందులో 1,24,528 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 961కి చేరుకుంది. యాక్టివ్ కేసుల సంఖ్య 31,607గా నమోదైంది. గృహాలు, ఇన్‌స్టిట్యూషనల్ ఐసొలేషన్‌లో 24,674 మంది చికిత్స పొందుతున్నారు.

అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొత్తగా 24 గంటల్లో 341 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ తరువాత రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 210 కరోనా కేసులు రికార్డు అయ్యాయి. కరీంనగర్, ఖమ్మం, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నల్లగొండ, వరంగల్ అర్బన్ జిల్లాల్లో వందకు పైగా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి.

Newly 2216 Covid19 positive cases and 11 deaths reported in Telangana last 24 hours

జిల్లాలవారీగా ఆదిలాబాద్-24, భద్రాద్రి కొత్తగూడెం-49, జగిత్యాల-56, జనగామ-33, జయశంకర్ భూపాలపల్లి-25, జోగుళాంబ గద్వాల-20, కామారెడ్డి-45, కరీంనగర్-119, ఖమ్మం-105, కొమరంభీమ్ ఆసిఫాబాద్-24, మహబూబ్ నగర్-36, మహబూబాబాద్-64, మంచిర్యాల-45, మెదక్-28, మేడ్చల్ మల్కాజ్‌గిరి-148, ములుగు-23, నాగర్ కర్నూలు-31, నల్లగొండ-126, నారాయణపేట్-11, నిర్మల్-28, నిజామాబాద్-84, పెద్దపల్లి-52, రాజన్న సిరిసిల్ల-54, రంగారెడ్డి-210, సంగారెడ్డి-76, సిద్ధిపేట్-66, సూర్యాపేట్-76, వికారాబాాద్-24, వనపర్తి-25, వరంగల్ రూరల్-24, వరంగల్ అర్బన్-102, యాదాద్రి భువనగిరి-42 కేసులు నమోదు అయ్యాయి.

Recommended Video

    Corona Virus India : 24 గంటల్లో 97,570 కొత్త కేసులు.. 46 లక్షలను దాటి కరోనా కేసులు | Oneindia Telugu

    కరోనా వైరస్ పరీక్షల జోరు కొనసాగిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. కొత్తగా 56,217 శాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు తమ తాజా బులెటిన్‌లో వెల్లడించారు. ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్ల సంఖ్య 21,34,912కు చేరుకుంది. ఆర్టీ-పీసీఆర్/సీబీనాట్/ట్రూనాట్, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్ కేంద్రాల ద్వారా పరీక్షలను నిర్వహిస్తున్నారు. ప్రతి 10 లక్షలమంది జనాభాకు సగటున 57,504
    పరీక్షలను నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+