తెలంగాణలో కరోనా కేసులు ఇలా: వెయ్యికి దిగువగా: యాక్టివ్ కేసుల్లోనూ
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రతలో పెద్దగా మార్పులేవీ కనిపించట్లేదు. కొత్త కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. రోజువారీ కేసుల సంఖ్య తగ్గుతుండటం ఊరట కలిగిస్తోంది. మరోసారి వెయ్యికి దిగువగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కోటుకుంటోన్న వారి సంఖ్య పరిమితంగానే ఉంటోంది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 997 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నలుగురు మరణించారు. 1,222 మంది పేషెంట్లు సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.
ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,55,663కు చేరుకుంది. ఇందులో 2,37,172 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 1397కు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్‌గా ఉన్న కేసులు 17,094గా నమోదు అయ్యాయి. గృహాలు, ఇన్‌స్టిట్యూషనల్ ఐసొలేషన్‌లో 14,466 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో కొత్తగా 169 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

జిల్లాలవారీగా ఆదిలాబాద్-18, భద్రాద్రి కొత్తగూడెం-65, జగిత్యాల-23, జనగామ-11, జయశంకర్ భూపాలపల్లి-16, జోగుళాంబ గద్వాల-10, కామారెడ్డి-22, కరీంనగర్-49, ఖమ్మం-44, మహబూబ్ నగర్-18, మహబూబాబాద్-20, మంచిర్యాల-19, మెదక్-16, మేడ్చల్ మల్కాజ్‌గిరి-85, ములుగు-21, నాగర్ కర్నూలు-25, నల్లగొండ-46, నారాయణపేట్-6, నిర్మల్-13, నిజామాబాద్-22, పెద్దపల్లి-21, రాజన్న సిరిసిల్ల-24, రంగారెడ్డి-66, సంగారెడ్డి-24, సిద్ధిపేట్-18, సూర్యాపేట్-30, వికారాబాాద్-12, వనపర్తి-10, వరంగల్ రూరల్-12, వరంగల్ అర్బన్-44, యాదాద్రి భువనగిరి-18 కేసులు నమోదు అయ్యాయి. కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో కొత్తగా ఒక్క కేసూ నమోదు కాలేదు.
Recommended Video
తెలంగాణ వ్యాప్తంగా 24 గంటల్లో 42,163 కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించినట్లు అధికారులు తమ తాజా బులెటిన్‌లో వెల్లడించారు. ఇప్పటిదాకా నిర్వహించిన నిర్ధారణ పరీక్షల సంఖ్య 48,12,167కు చేరుకుంది. ప్రతి 10 లక్షల మంది జనాభాకూ 1,29,289 టెస్టులను నిర్వహించినట్లు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications