వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ ఈసారి అసెంబ్లీకి కాదు.. లోక్‌స‌భ‌కు పోటీ? నియోజ‌క‌వ‌ర్గం ఖ‌రారు??

|
Google Oneindia TeluguNews

రాజ‌కీయ వ్యూహాల్లో గండర గండ‌డుగా పేరు తెచ్చుకున్నారు తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు. గ‌జ్వేల్ నుంచి వ‌రుస‌గా రెండుసార్లు గెలిచి ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన కేసీఆర్ ఈసారి అక్క‌డి నుంచి పోటీచేయ‌డంలేద‌ని స‌మాచారం. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర స‌మితి వ‌ర్గాలు కూడా ఔన‌నే అంటున్నాయి. కేసీఆర్ బ‌దులుగా ఈసారి టీఆర్ఎస్ త‌ర‌ఫున వంటేరు ప్ర‌తాప్‌రెడ్డి పోటీచేయ‌బోతున్నారు.

 మెద‌క్ నుంచి ఎంపీగా పోటీ?

మెద‌క్ నుంచి ఎంపీగా పోటీ?

కేసీఆర్ పోటీచేసిన రెండుసార్లు ప్ర‌తాప్‌రెడ్డి తెలుగుదేశం త‌ర‌ఫున ఒక‌సారి, కాంగ్రెస్ త‌ర‌ఫున ఒక‌సారి గ‌ట్టి పోటీనిచ్చారు. త‌ర్వాత ఆయ‌న టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. నియోజ‌క‌వ‌ర్గం మొత్తం క‌లియ‌దిరుగుతూ గ‌ట్టి ప‌ట్టు సాధిస్తున్నారు. త‌ర్వాత ఎన్నిక‌ల్లో పోటీచేయ‌బోయేది ఆయ‌నేన‌ని స్ప‌ష్టం కావ‌డంతో కేసీఆర్ వ్యూహం ఎలా ఉంటుందోన‌ని ప్ర‌తిప‌క్షాలు ఎదురు చూస్తున్నాయి. జాతీయ రాజ‌కీయాల‌పై దృష్టిసారించాల‌నే ఉద్దేశంతో ఉన్న కేసీఆర్ ఈసారి లోక్‌స‌భ‌కు పోటీచేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న మెద‌క్ నియోజ‌క‌వ‌ర్గంపై దృష్టిసారించార‌ని, చాప‌కింద నీరులా పార్టీ ఓటుబ్యాంకును ప‌టిష్ట‌త చేసుకునే ప్ర‌య‌త్నాలు కూడా జ‌రుగుతున్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

 కేంద్రంలో కీల‌కపాత్ర పోషించాలంటే ఎంపీగా వెళ్లాలి!!

కేంద్రంలో కీల‌కపాత్ర పోషించాలంటే ఎంపీగా వెళ్లాలి!!

ముఖ్య‌మంత్రి నియోజ‌క‌వ‌ర్గం మార‌డం అంటే పార్టీ శ్రేణుల‌కు త‌ప్పుడు సంకేతాలు వెళ‌తాయ‌ని, పార్టీ విజ‌యంపై అప‌న‌మ్మ‌కం ఏర్ప‌డుతుంద‌ని, ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గం మార‌కుండా ఉంటేనే మంచిద‌ని పార్టీలోని సీనియ‌ర్ నేత‌లు సూచిస్తున్నారు. అయితే గ‌తంలో మెద‌క్ లోక్ స‌భ నుంచి కేసీఆర్ ప్రాతినిధ్యం వ‌హించారు. జాతీయ రాజ‌కీయాల‌పై దీష్టిసారించాలంటే ముఖ్య‌మంత్రిగా కాకుండా ఎంపీగా వెళ్లాల‌ని ఆయ‌న త‌ల‌పోస్తున్నారు. అంతేకాకుండా ప‌రిస్థితులు అనుకూలిస్తే కేంద్రంలో ఏదైనా ముఖ్య‌మైన ప‌ద‌వి కూడా చేప‌ట్టాల‌ని కేసీఆర్ యోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

 కేసీఆర్ వ్యూహాన్ని అంచ‌నా వేయ‌డం క‌ష్టం

కేసీఆర్ వ్యూహాన్ని అంచ‌నా వేయ‌డం క‌ష్టం


కేసీఆర్ వ్యూహాన్ని అంచ‌నా వేయ‌డం క‌ష్ట‌మ‌ని, అన్నీ అంచ‌నా వేసిన త‌ర్వాతే ఆయ‌న నిర్ణ‌యం తీసుకుంటార‌ని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అంటున్నాయి. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా బీజేపీని ఢీకొడుతున్న నేత‌గా కేసీఆర్ త‌న‌ను తాను ప్రొజెక్ట్ చేసుకుంటున్నార‌ని, ఇంకా ఢీకొట్టాలంటే ఎమ్మెల్యేగా ఉంటే బ‌లం స‌రిపోద‌ని, ఎంపీగా ఉండాల‌నేది కేసీఆర్ వ్యూహమ‌ని సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌లు అంటున్నారు. ఢిల్లీ స్థాయిలో రాజ‌కీయాలు చేయాలంటే ఢిల్లీలో ఉండ‌టం త‌ప్ప‌నిస‌ర‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. పార్టీ త‌ర‌ఫున ఇత‌రులు ఈ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న‌ప్ప‌టికీ నేరుగా తానే రంగంలోకి దిగాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అందుకు త‌గ్గ కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను ఇప్ప‌టినుంచే రూపొందించుకుంటున్నారు.

English summary
KCR is not for the assembly this time .. competition for the LokSabha? Constituency finalized??
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X