మునుగోడు కేంద్రంగా చంద్రబాబు బిగ్ డెసిషన్ - ఢిల్లీ మంత్రాంగం..!?

మునుగోడు ఉప ఎన్నిక వేళ టీడీపీ అధినేత మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. మునుగోడులో పోటీ చేయాలని తొలుత భావించినా..చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకున్నారు. ఇప్పుడు ఏపీ లో అధికారం దక్కించుకోవటమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న చంద్రబాబు ఆ దిశగానే ఇప్పుడు మరో నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. మునుగోడు టు ఏపీ కొత్త వ్యూహం సిద్దం చేస్తున్నారు. మునుగోడులో ఇప్పుడు మూడు ప్రధనా పార్టీల మధ్య పోటీ కీలకంగా మారుతోంది. అందులో బీజేపీ - టీఆర్ఎస్ కు ఈ ఎన్నిక ప్రతిష్ఠాత్మకం అయింది. దీంతో..మునుగోడులో ఏ ఒక్క ఓటు వదులుకోవటానికి బీజేపీ సిద్దంగా లేదు. తమకు సహకరించే వర్గాలు..నేతలతో పాటుగా టీటీడీపీ నేతలతోనే సంప్రదింపులు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

తెలంగాణ బీజేపీ నేతలు కొద్ది రోజుల క్రితం వరకూ టీడీపీతో తమకు పొత్తు ఉండదని స్పష్టంగా వెల్లడించారు. ఇప్పుడు మునుగోడులో పోరు కీలకం ..వచ్చే అసెంబ్లీ ఎన్నికల ముందు సెమీ ఫైనల్ గా భావిస్తుండటంతో..ఇప్పుడు ఆలోచన మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన కొందరు సన్నిహితులు..టీటీడీపీ నేతలతో మద్దతు కోసం సంప్రదించినట్లుగా తెలుస్తోంది. ఆ సంప్రదింపుల కారణంగానే చివరి రోజు వరకు తమ అభ్యర్ధిని బరిలో దించాలని భావించిన టీడీపీ చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకొని పోటీ నుంచి తప్పుకుంది. ఇప్పుడు బీజేపీ అభ్యర్ధికి టీడీపీ మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

News Roaming That TTDP likely To support BJP Candidate in Munugode by poll

దీనికి సంబంధించి పార్టీ అధినేత చంద్రబాబుతో బీజేపీ నేతలు రాయబారం నడిపినట్లుగా చెబుతున్నారు. ఏపీలో రానున్న ఎన్నికల్లో టీడీపీ అటు జనసేన - ఇటు బీజేపీతోనూ పొత్తుతో ముందుకు వెళ్లాలని భావిస్తోంది. దీంతో, ఇప్పుడు మనుగోడు లో టీడీపీ శ్రేణులు బీజేపీకి మద్దతుగా పని చేసే అవకాశం అవకాశం ఉందని తెలుస్తోంది. దీని పైన టీడీపీ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. తాజాగా, టీడీపీలో కాసాని జ్ఞానేశ్వర్ చేరారు. ఆయన గతంలో రంగారెడ్డి జిల్లాలో పార్టీలో కీలకంగా పని చేసారు. అనూహ్య పరిస్థితుల్లో రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్మన్ గా పని చేసారు. ఈ సమయంలో మరి కొందరు మాజీ నేతలతోనూ పార్టీ నుంచి సంప్రదింపులు కొనసాగుతున్నాయి.

ఇప్పుడు కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన ...బీజేపీ లక్ష్యంగా రాజకీయ అడుగులు వేస్తున్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇటు హైదరాబాద్ నగరంతో పాటుగా పార్టీకి పట్టున్న ప్రాంతాల్లో తన బలం మరింత పెంచుకొనే వ్యూహాలను అమలు చేస్తున్నారు. దీని ద్వారా..ఎన్నికల సమయానికి ఏపీ కేంద్రంగా తాను అనుకున్న లక్ష్యాలు - పొత్తులకు లైన్ క్లియర్ చేసుకోవాలనే ఆలోచన లో ఉన్నట్లుగా సమాచారం. ఇక, ఇప్పుడు మునుగోడుకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లోనే అధికారికంగా స్పష్టత రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+