తెలంగాణ ప్రభుత్వానికి ఎన్‌హెచ్ఆర్సీ నోటీసులు: ఎందుకంటే?
హైదరాబాద్: రాజేంద్రనగర్‌లోని జయశంకర్ విశ్వవిద్యాలయం వద్ద ఏబీవీపీ నాయకురాలి పట్ల పోలీసుల దురుసు ప్రవర్తనపై జాతీయ మానవ హక్కుల సంఘం (NHRC) స్పందించింది. ఈ ఘటనపై వివరణ కోరతూ తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. హైకోర్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం వర్సిటీకి చెందిన భూమిని కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ జనవరి 25న విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు ఏబీవీపీ నాయకులు వర్సిటీ వద్దకు వెళ్లారు. ఆందోళనకారులను నిలువరించే క్రమంలో ఇద్దరు లేడీ కానిస్టేబుళ్లు వారి పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. స్కూటీపై వెళ్తూ ఏబీవీపీ నాయకురాలి జుట్టు పట్టులాగారు. దీంతో ఆమె కిందపడిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో కథనాల ఆధారంగా సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల సంఘం.. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి తోపాటు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. అంతేగాక, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోలీసు తీరుపై ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థినిపై పోలీసుల దాడి అమానుషమని బీఆర్ఎస్ కవిత మండిపడ్డారు. ఇది తీవ్రంగా ఆందోళన కలిగించే అంశమని, ప్రజాస్వామ్యంలో ఇలాంటివి ఆమోదయోగ్యం కాదన్నారు.
The recent incident involving Telangana police is deeply concerning and absolutely unacceptable. Dragging a peaceful student protester and unleashing abrasive behaviour on the protestor raises serious questions about the need for such aggressive tactics by the police.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) January 24, 2024
This… pic.twitter.com/p3DH812ZBS
ఇదే నా ఫ్రెండ్లీ పోలీసింగ్? అంటూ ఎమ్మెల్సీ కవిత నిలదీశారు. ఈ మేరకు కవిత ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు. పోలీసులు వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జాతీయ మానవ హక్కుల సంఘం(NHRC) జోక్యం చేసుకోవాలంటూ ట్వీట్‌ను ట్యాగ్ చేయడం గమనార్హం.
మరోవైపు, ఏబీవీపీ మహిళా కార్యకర్తను జుట్టుపట్టిలాగిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. వ్యవసాయ యూనివర్సిటీ భూములు హైకోర్టుకు కేటాయించవద్దని ఆందోళనకు దిగిన వాళ్లను తరిమికొట్టడమే గాకుండా, రోడ్డున వెళ్తున్న విద్యార్థి నాయకురాలి జుట్టు లాగిన పోలీసుల పైశాచికత్వం. సాటి ఆడవారి పట్ల కనీస మర్యాద పాటించని పోలీసులు. ఈ ఘటన అప్రజాస్వామిక, విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వ చర్యలను ప్రతిబింబిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, ఘటన అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి నాయకురాలిని పలువురు బీజేపీ నాయకులు పరామర్శించారు.
-
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్












Click it and Unblock the Notifications