• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

హైదరాబాద్‌లో విధ్వంసానికి ఐఎస్ కుట్ర: మదర్ ఆఫ్ సాతాన్ (ఫొటోలు)

By Pratap
|

హైదరాబాద్‌: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో భారీ విధ్వంసానికి కుట్ర చేసిన ఐఎస్ఐఎస్ సానుభూతిపరులు అత్యంత పకడ్బందీగా పథక రచన చేసి అమలు చేయడానికి సిద్ధపడినట్లు అర్థమవుతోంది. వారు 40 నుంచి 50 ఇంప్రొవైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైస్‌ (ఐఈడీ)లను తయారుచేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ విధ్వంసానికి కుట్ర: ఐసిస్ టెర్రరిస్టుల ప్లాన్ ఇదే

చార్మినార్ సమీపంలో నిజాం ప్రభుత్వం నిర్మించిన చారిత్రక భాగ్యలక్ష్మి దేవాలయాన్ని ధ్వంసం చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. అదే సమయంలో రద్దీ ప్రాంతాల్లో, ఐటి కారిడార్‌లో కూడా పేలుళ్లకు తెగబడాలని ప్లాన్ వేసుకున్నట్లు చెబుతున్నారు.

టెక్కీ సాయంతో హైద్రాబాద్‌లో పేలుళ్లకు ఐసిస్ ప్లాన్: ఏం జరిగింది? (పిక్చర్స్)సోషల్‌ మీడియాలో పలువురు ఆకతాయిలు పోస్ట్‌ చేస్తున్న పుకార్లను నమ్మొద్దని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి ప్రజలకు సూచించారు. నగరంలో భద్రత, రక్షణకు ఎలాంటి ఢోకా లేదని ఆయన చెప్పారు. శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని చెప్పారు. సున్నిత ప్రదేశాల్లో పోలీసు బందోబస్తును పెంచామని ఆయన తెలిపారు.

హైదరాబాదులోనే కొనుగోలు..

హైదరాబాదులోనే కొనుగోలు..

ఐఈడి తయారీకి అవసరమైన పదార్థాలను ఉగ్రవాదులు హైదరాబాద్‌లో కొనుగోలు చేసినట్లు తేలింది. ఎన్ఐఎకు చిక్కిన ఐఎస్‌ కుట్రదారుల అవి లభించాయి.

పెద్దయెత్తున కొనుగోలు...

పెద్దయెత్తున కొనుగోలు...

వందలకొద్దీ కిలోలు, లీటర్ల చొప్పున ఎసిటోన్‌, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, యూరియా, అమ్మోనియం నైట్రేట్‌, నైట్రిక్‌ యాసిడ్‌, సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ను వీరు గత నాలుగైదునెలల్లో కొనుగోలు చేశారు.

ఇటువంటి ప్రయత్నం తొలిసారి...

ఇటువంటి ప్రయత్నం తొలిసారి...

ఇప్పటి వరకు మనదేశంలో జరిగిన ఐఈడీ పేలుళ్లలో ఉగ్రవాదులు అమ్మోనియం నైట్రేట్‌, యూరియా వంటి ముడిసరుకును బాంబుల తయారీలో వాడుతూ వచ్చారు. మొదటిసారి ట్రైఎసిటోన్‌ ట్రైపెరాక్సైడ్‌ను వినియోగించడానికి పథకం వేసుకున్నరు.

ఆ దాడుల్లో వాడినవి ఇవే...

ఆ దాడుల్లో వాడినవి ఇవే...

2005లో లండన్‌ను వణికించిన బాంబు దాడుల్లో, నిరుడు పారిస్‌ దాడుల్లో, ఈ ఏడాది బ్రసెల్స్‌ విమానాశ్రయంలో జరిపిన దాడుల్లో ఉపయోగించిన ఐఈడీల తయారీలో వాడిన పదార్థం ఇదేనని చెబుతున్నారు.

పసిగట్టడం కష్టం

పసిగట్టడం కష్టం

టీఏటీపీ తదితర ఎసిటోన్‌ పెరాక్సైడ్‌ పేలుడు భారీ స్థాయిలో ఉంటుంది. వీటితో తయారుచేసే బాంబుల్లో నైట్రోజన్‌ ఉండదు కాబట్టి వీటిని పేలుడు పదార్థాలను గుర్తించే ‘ఎక్స్‌ప్లోజివ్‌ డిటెక్షన్‌ స్కానర్లు' పసిగట్టలేవు . దానికితోడు ఖర్చు తక్కువ.

మదర్ ఆఫ్ సాతాన్

మదర్ ఆఫ్ సాతాన్

అవి పేలిన తర్వాత ఎంత ప్రమాదాన్ని సృష్టిస్తాయో, వాటితో బాంబులు తయారు చేసేటప్పుడూ అంతే ప్రమాదం ఉంటుంది. ప్రమాదవశాత్తూ పేలడానికి అవకాశం ఎక్కువ ఉన్న పేలుడు పదార్థం అంది. అందుకే బాంబు తయారీదారులు దీన్ని ముద్దుగా ‘మదర్‌ ఆఫ్‌ సాతాన్‌ (సైతానుకు మాత)' పిలుస్తుంటారు.

అత్యంత భయంకరంగా ఉండడానికే...

అత్యంత భయంకరంగా ఉండడానికే...

హైదరాబాద్‌లో తాము తరఫున మొదటిసారి సృష్టింబోయే మారణహోమం అత్యంత భయానకంగా ఉండాలనే ఉద్దేశంతో ఐఎస్‌ కుట్రదారులు తమ పథకంలో దాన్ని చేర్చారని అంటున్నారు.

అంత సులబం కాదు...

అంత సులబం కాదు...

యూరియా, పెట్రోల్‌, షుగర్‌లను కలిపి చిన్నపాటి బాంబు తయారు చేయవచ్చు. అమ్మోనియం నైట్రేట్‌, యూరియా, ఎసిటోన్‌ వంటి వాటితో భారీ పేలుడుకు సృష్టించేందుకు అవకాశం ఉంది. అది అంత సులభం కాదు.

ప్రాణాలే పోతాయి..

ప్రాణాలే పోతాయి..

సరిగా తెలియకుండా ప్రయత్నం చేస్తే ప్రాణాలు ఎగిరిపోతాయి. వీటిని తగిన పాళ్లలో కలిపి బాంబుగా తయారుచేయాల్సి ఉంటుందని అంటున్నారు. అందుకే ఇరాక్‌లోని షఫీ అనే వ్యక్తి నుంచి ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పించుకుని ఈ బాంబు తయారీలో శిక్షణ పొందినట్లు తెలుస్తోంది.

ట్రయల్స్ ఈ ప్రాంతాల్లో...

ట్రయల్స్ ఈ ప్రాంతాల్లో...

బండ్లగూడ, నర్సాపూర్‌ ప్రాంతాల్లో మూడుసార్లు ఐఎస్ కుట్రదారులు ట్రయల్స్‌ నిర్వహించారు. సానుకూల ఫలితం రావటంతో వ్యూహరచనకు లక్ష్యాలను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

విధ్వంసం బీభత్సంగా ఉంటుంది..

విధ్వంసం బీభత్సంగా ఉంటుంది..

పేలుడు ధాటికి ఈ బాంబుల తయారీకి వాడిన ఐరన్‌బాల్స్‌, మేకులు కిలోమీటర్ల వేగంతో శరీరభాగాల్లోకి చొచ్చుకుపోతాయి. శబ్ద తీవ్రతకు కర్ణబేరి బద్దలవుతుంది. శరీరం ఛిద్రమవుతుంది.

గుర్తించే సమయంలో ఇలా..

గుర్తించే సమయంలో ఇలా..

అనుమానస్పద వస్తువులు, బ్యాగులు గుర్తించినపుడు 50 అడుగల దూరంలో ఉండటం వల్ల ప్రమాద తీవ్రతను అధిగమించవచ్చని పోలీసులు చెబుతున్నారు.

ఇలా చేయాలి...

ఇలా చేయాలి...

ప్రమాదకరమైన వస్తువు చుట్టూ ఇసుకను పోయడం ద్వారా తీవ్రతను తగ్గింవచ్చునని చెబుతున్నారు. అప్రమత్తత కారణంగానే భారీ విధ్వంసాన్ని అపగలిగారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
National Investigation Agency Team Prodeuced Suspect IS Youth in Nampally Court of Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more