టెక్కీ సాయంతో హైద్రాబాద్‌లో పేలుళ్లకు ఐసిస్ ప్లాన్: ఏం జరిగింది? (పిక్చర్స్)

హైదరాబాద్: హైదరాబాద్ పైన ఐసిస్ గురిపెట్టింది. నగరంలో మారణకాండకు ప్లాన్ వేసింది. మాదాపూర్, బేగంబజార్, దిల్‌సుఖ్ నగర్‌లను టార్గెట్ చేసింది ఒకేరోజు మూడు చోట్ల పేలుళ్లకు వ్యూహం పన్నారు. రెక్కీ నిర్వహించారు. ప్రముఖులు, రాజకీయ నాయకుల ఇళ్ల వద్ద కూడా రెక్కీ నిర్వహించారు.

ఇందుకోసం, ఆధునిక టైమర్ బాంబుల తయారీలో నిమగ్నమయ్యారు. ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. అనూహ్యంగా ఎన్ఐఏ, హైదరాబాద్ పోలీసులు సోదాలు నిర్వహించి, అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. పదకొండు సోదాలు నిర్వహించారు.

పెద్ద మొత్తంలో మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. రూ.15 లక్షల నగదు, విదేశీ కరెన్సీని పట్టుకున్నారు. ఎయిర్ పోర్ట్, పరిశోధన సంస్థల వద్ద ఆంక్షలు విధించారు. దేశంలోని ఇతరచోట్ల పేలుళ్లకు వ్యూహం పన్నారు. ఇదిలా ఉండగా, అరెస్టన వారిలో ప్రధాన సూత్రధారని సాఫ్టు వేర్ ఇంజనీర్ ఇబ్రహీం యాజ్దానీ అని తెలుస్తోంది. ఇతను నెట్ సెంటర్ నడుపుతున్నాడు.

ప్రసాద్ ఐమాక్స్, అమీర్ పేట బిగ్ బజార్, గచ్చిబౌలీ ఐటీ కంపెనీలు ఉగ్రవాదుల టార్గెట్లో ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఐటీ కంపెనీలు, వాణిజ్య సముదాయాల పైన దాడులే వీరి లక్ష్యం. త్వరలో జరగనున్న గణేష్ ఉత్సవాలు కూడా టార్గెట్ కావొచ్చునని అంటున్నారు. ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న మందుగుండు సామాగ్రితో దాదాపు 500 మందిని చంపవచ్చునని పోలీసులు గుర్తించారు.

 ఏం జరిగింది?

ఏం జరిగింది?

హైదరాబాద్‌లో విధ్వంసం సృష్టించేందుకు పాతబస్తీకి చెందిన మొత్తం 11 మంది యువకులు జట్టుకట్టారు. భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు ఐసిస్‌ అనుబంధంగా స్థాపించిన టఅన్సార్‌ ఉల్‌తౌహీద్‌ సీ బిలాద్‌ అల్‌హింద్ట(ఎయుటి) తరఫున వీరంతా పని చేస్తున్నారు. ప్రస్తుతం సిరియాలో ఉంటున్న భారత్‌కు చెందిన షఫీఆర్మర్‌ ఈ సంస్థను స్థాపించాడు.

ఏం జరిగింది?

ఏం జరిగింది?

ఈ బృందానికి ఎయుటి తరఫున మహ్మద్‌ ఇబ్రహీం యజ్దానీ నాయకత్వం వహిస్తున్నాడు. గల్ఫ్‌దేశాల్లో ఉండివచ్చిన ఇబ్రహీంకు మంచి కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉంది. ఐసిస్‌ కార్యకలాపాలపట్ల ఆకర్షితుడైన ఇబ్రహీం సామాజిక మాధ్యమాల ద్వారా భావసారూప్యం గల వారిని ఆకట్టుకోవడం మొదలుపెట్టాడు. మొత్తం పదిమందితో స్నేహం పెంచుకుని. వారితో విధ్వంసం సృష్టించాలని కుట్రపన్నాడు.

 ఏం జరిగింది?

ఏం జరిగింది?

నాలుగైదు నెలలుగా వీరు నిరంతరం సంప్రదింపులు జరుపుకుంటున్నారు. ఇందుకోసం 40 సెల్‌ఫోన్లు, సిమ్‌కార్డులు కొన్నారు. సామాజికమాధ్యమాల ద్వారా సిరియా, గల్ఫ్‌దేశాల్లో ఉన్న అగ్రనేతలతో సంప్రదిస్తున్నారు. ఐసిస్‌ ఏర్పడ్డ తర్వాత హైదరాబాద్‌లో ఉగ్రవాద చర్యలకు అనేకసార్లు ప్రయత్నించినా చివరి నిమిషంలో పోలీసులకు పట్టుబడ్డారు. కాగా, ఐదుగుర్ని అరెస్టు చేసిన పోలీసులు, ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.

ఏం జరిగింది?

ఏం జరిగింది?

వీరిలో హైదరాబాద్‌కు చెందినవారు నలుగురు. ప్రయత్నాలన్నీ విఫలమవుతుండటంతో ఎట్టిపరిస్థితుల్లోనూ తమ ఉనికి చాటుకోవాలని కృతనిశ్చయంతో ఉన్నారు. ఇప్పుడు కూడా పోలీసులకు దొరికిపోయారు. తాజాగా పట్టుబడ్డవారిలో ఇంజినీర్లు మొదలు పదోతరగతి చదివినవారు, మెకానిక్‌లు వంటి వారున్నారు. ఇద్దరు అన్నదమ్ములు కూడా ఉన్నారు.

ఎన్ఐఏ కార్యాలయం వద్ద టెన్షన్

ఎన్ఐఏ కార్యాలయం వద్ద టెన్షన్

విధ్వంసానికి కుట్ర పన్నిన ఐసిస్ సానుభూతిపరులుగా అనుమానిస్తున్న 11 మందిని బుధవారం ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేయడంతో బేగంపేటలోని ఎన్‌ఐఏ కార్యాలయం వద్ద బుధవారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకుంది.

ఎన్ఐఏ కార్యాలయం వద్ద టెన్షన్

ఎన్ఐఏ కార్యాలయం వద్ద టెన్షన్

ఐసిస్ సానుభూతిపరులుగా అనుమానిస్తున్న వారి కుటుంబ సభ్యులు పలువురు బేగంపేట చికోటి గార్డెన్స్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసేందుకు వస్తున్నట్లు సమాచారం అందడంలో స్థానిక పోలీసులు, అధికారులు అప్రమత్తమాయ్యారు.

 ఎన్ఐఏ కార్యాలయం వద్ద టెన్షన్

ఎన్ఐఏ కార్యాలయం వద్ద టెన్షన్

ఎన్‌ఐఏ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సమాచారం తెలిసి పలు మీడియా సంస్థలకు చెందిన ఓబీ వాహనాలు, పాత్రికేయులు అధిక సంఖ్యలో ఎన్‌ఐఏ కార్యాలయం వద్దకు చేరారు.

ఎన్ఐఏ కార్యాలయం వద్ద టెన్షన్

ఎన్ఐఏ కార్యాలయం వద్ద టెన్షన్

హైదరాబాదులోని పాతబస్తీలో ఎన్ఐఏ, తెలంగాణ పోలీసులు బుధవారం సోదాలు నిర్వహించారు. ఐసిస్ సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకీ తీసుకున్న షఫీ అర్మార్

ఏం జరిగింది

ఏం జరిగింది

హైదరాబాదులోని పాతబస్తీలో ఎన్ఐఏ, తెలంగాణ పోలీసులు బుధవారం సోదాలు నిర్వహించారు. ఐసిస్ సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకీ తీసుకున్న హబీబ్.

 ఏం జరిగింది?

ఏం జరిగింది?

హైదరాబాదులోని పాతబస్తీలో ఎన్ఐఏ, తెలంగాణ పోలీసులు బుధవారం సోదాలు నిర్వహించారు. ఐసిస్ సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకీ తీసుకున్న ఇబ్రహ��ం.

 ఏం జరిగింది?

ఏం జరిగింది?

హైదరాబాదులోని పాతబస్తీలో ఎన్ఐఏ, తెలంగాణ పోలీసులు బుధవారం సోదాలు నిర్వహించారు. ఐసిస్ సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్నారు.

ఏం జరిగింది?

ఏం జరిగింది?

హైదరాబాదులోని పాతబస్తీలో ఎన్ఐఏ, తెలంగాణ పోలీసులు బుధవారం సోదాలు నిర్వహించారు. ఐసిస్ సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+