ఇస్లామిక్ స్టేట్ కోసం 15 మందిని ప్రేరేపించా: విచారణలో నిక్కీ జోసెఫ్

హైదరాబాద్: ఐఎస్‌ఐఎస్ సానుభూతిపరురాలు నిక్కిజోసెఫ్ అలియాస్ అఫ్షా జబీన్ వెల్లడించిన 15 మందిని విచారించేందుకు హైదరాబాదు పోలీసులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నిక్కీ జోసెఫ్ పోలీసు కస్టడి గురువారంతో ముగిసింది. సామాజిక మాధ్యమాల ద్వారా యువతీయువకులను ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్, సిరియావైపు మళ్లిస్తోందన్న అభియోగాలపై ఆమెను ఈ నెల 11న శంషాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.

నిక్కి జోసెఫ్ నుంచి మరిన్ని వివరాలు సేకరించేందుకు ఈ నెల 14న పది రోజుల పాటు సైబరాబాద్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ మేరకు ఆమెను విచారించగా దేశవ్యాప్తంగా 15మందిని ఉగ్రవాద భావజాలంవైపు మళ్లించి ఐఎస్‌ఐఎస్‌లో చేర్చేందుకు యత్నించానని, అందులో ముగ్గురు నగరవాసులు కూడా ఉన్నారని వెల్లడించినట్టు తెలిసింది.

 Nicky Joseph sent 15 persons into ISIS

ఆమె వెల్లడించిన వారిలో కొందరిని గుర్తించి విచారిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. నగరంలోని టోలిచౌక్ ప్రాంతానికి చెందిన నిక్కి జోసెఫ్ ఫేస్‌బుక్ ద్వారా యువతను ఉగ్రవాద భావజాలం వైపు మళ్లించేయత్నంలో సల్మాన్ మోహియుద్దీన్‌తో పరిచయం ఏర్పడింది.

మొహియుద్దీన్ గత జనవరిలో అమెరికా నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా శంషాబాద్‌లో అరెస్టయ్యాడు. దాంతో నిక్కి జోసెఫ్ కార్యకలాపాలు కూడా బయటపడ్డాయి. ఈ నెల 11న ఆమె కుటుంబ సభ్యులతో నగరానికి వస్తుండగా పక్కా సమాచారం మేరకు ఆమెను సైబరాబాద్ పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఇదిలావుండగా నిక్కిజోసెఫ్‌ను నేషనల్ ఇనె్వస్టిగేషన్ టీం (ఎన్‌ఐటి) కూడా కస్టడిలోకి తీసుకొని విచారణ జరుపనున్నట్టు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+