హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నైజీరియన్ల కొత్త దందా: ఆన్‌లైన్‌లో హెర్బల్ ఆయిల్ అమ్మకాలు, అరెస్ట్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇటీవల కాలంలో నగరంలో నైజరీయన్ల మోసాలు మరింతగా ఎక్కువయ్యాయి. తాజాగా మరో మోసం వెలుగులోకి వచ్చింది. జంతువులకు సంబంధించిన వ్యాక్సిన్ తయారీలో బయోమెక్టిన్ హెర్బల్ అయిల్ కీలకమని, ఆమెరికాలో గిరాకీ ఉందంటూ మోసం చేసిన నిందితుడిని సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు.

సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన డెవిడ్‌కు ఫేస్‌బుక్‌లో కెయిర అనే మహిళ పరిచయం అయ్యింది. తాను బయోమిక్టిన్ హెర్చల్ విక్రయించే వ్యాపార సంస్థలో పనిచేస్తున్నానని, దానికి అమెరికాలో చాలా గిరాకీ ఉందని నమ్మించింది. అయితే అదే అయిల్ ముంబైలో తక్కువ ధరకు లభ్యమవుతోందని, ఇక్కడకు సైప్లె చేస్తే భారీ లాభాలు వస్తాయంటూ నమ్మబలికింది.

ముంబైలోని ఓ వ్యాపారి నెంబర్‌ను సంప్రదించాలని సూచించడంతో డెవిడ్‌ అతడిని కాంటాక్టక్ చేశాడు. ఆమె చెప్పింది, సదరు వ్యాపారి చెప్పింది ఒకటే కావడంతో తనకు శాంపిల్‌గా ఒక లీటర్ ఆయిల్ పంపించాలంటూ డేవిడ్ ముంబై వ్యాపారితో ఒప్పందం చేసుకొని రూ. 5 లక్షలు పంపించాడు.

Nigerian arrested for herbal oil business in hyderabad

అయితే ఒప్పందం ప్రకారం డబ్బు పంపినా ఆయిల్ రాకపోవడంతో ముంబైలోని వ్యాపారిని డేవిడ్ సంప్రదించాడు. కొరియర్ సమస్య వచ్చిందంటూ కొరియర్ నెంబర్ ఇవ్వడంతో ఆయిల్‌ను కొరియర్‌లో పంపించలేకపోతున్నామని, వచ్చి తీసికెళ్లాలంటూ సూచించారు. దీంతో డెవిడ్ ముంబయికి వెళ్లి తీసుకున్నాడు.

అక్కడ ఒక ప్రాంతానికి వచ్చి కొరియర్ బాయ్ దానిని డెవిడ్‌కు అప్పగించి వెళ్లాడు. హైదరాబాద్‌కు వచ్చి కెయిరతో ఫేస్‌బుక్‌లో చాటింగ్ చేయడంతో ఒక లీటర్ సరిపోదు, 20 లీటర్లు అయితే ఇక్కడ తీసుకుంటారంటూ సూచిందింది. తిరిగి ముంబై వ్యాపారిని సంప్రదించడంతో వివిధ బ్యాంకు ఖాతాలలో డబ్బు డిపాజిట్ చేయమని చెప్పడంతో రూ. 36 లక్షల వరకు పంపించాడు.

తీరా అదంతా మోసమని తెలియడంతో డేవిడ్ సైబర్‌క్రైమ్ పోలీసులను సంప్రదించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఒక బృందాన్ని ముంబైకి పంపించారు. పోలీసుల విచారణలో నైజీరియన్ ముఠా అమాయకులను మోసం చేసేందుకు ఏర్పాటు చేసిన నెట్‌వర్క్‌లో భాగంగా ఢిల్లీలోని కొరియర్ సంస్థ నిర్వాహకుడు జాన్ డిసౌజా పాత్ర ఉందని పోలీసులు నిర్ధారించారు.

అమాయకులకు ముందుగా ఒక లీటర్ అయిల్ పంపించడం, అది కొరియర్‌లో రావడం లేదని చెప్పడం, ముంబైకి పిలిపించుకొని దానిని వారికి అందజేయడం అతని డ్యూటీ. ఇలా 20 మందికి దేశ వ్యాప్తంగా 20 బాటిళ్లను సరఫరా చేయడం, వారి నుంచి రూ. 35 నుంచి 40 లక్షల వరకు నైజీరియన్ ముఠా మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఇలా నైజీరియన్ ముఠాతో కలిసి కొరియర్ సంస్థ ముసుగులో మోసం చేస్తున్నట్లు తేలడంతో నిందితుడిని సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా ప్రధాన సూత్రదారి జాన్ కోసం పోలీసులు ముంబైలో గాలింపు చేపట్టారు. సుమారు రూ. 6 కోట్ల వరకు అమాయకులను జాన్ మోసం చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

English summary
Nigerian arrested for herbal oil business in hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X