హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భారీ ప్యాకేజీ ఉద్యోగమంటూ మహిళ నుంచి రూ.6లక్షలు కాజేశారు: ఎలాగంటే..?

విదేశాల్లో ఉద్యోగం.. భారీ ప్యాకేజీతో వేతనం అంటూ ఓ మహిళకు మెయిల్‌ చేసి ఆమె నుంచి రూ.6.50లక్షలు దండుకుని మోసగించిన నైజీరియన్‌ను సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలో నైజీరియన్ల మోసాలకు అంతేలేకుండా పోతోంది. డ్రగ్స్, ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న నైజీరియన్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా,
విదేశాల్లో ఉద్యోగం.. భారీ ప్యాకేజీతో వేతనం అంటూ ఓ మహిళకు మెయిల్‌ చేసి ఆమె నుంచి రూ.6.50లక్షలు దండుకుని మోసగించిన నైజీరియన్‌ను సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు.

ఏసీపీ జయరాం తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేసే మహిళ మెయిల్‌ ఐడీకి భారీ వేతనంతో విదేశాల్లో ఉద్యోగం కల్పిస్తున్నట్లు కేసీఏ డ్యూటాగ్‌ కంపెనీకి సంబంధించిన నియామక పత్రం వచ్చింది. విదేశీ నంబరు ద్వారా ఓ వ్యక్తి ఆమెకు ఫోన్‌ చేసి వీసా కోసం టోనీ మోర్‌ ట్రావెలింగ్‌ లిమిటెడ్‌ను సంప్రదించాలని సూచించాడు. దీంతో వెంటనే ఆమె ఆ కంపెనీకి సంప్రదించారు.

వీసా కోసం కంపెనీ వారు సూచించిన విధంగా వివిధ ఖాతాల్లో బాధితురాలు రూ.6.50లక్షలు జమ చేశారు. అయినా విసా విషయంలో టోనీ మోర్‌ ట్రావెల్స్‌ నుంచి మరిన్ని మెయిల్స్‌ వచ్చాయి. చివరికి ఆ ట్రావెల్స్‌ ప్రతినిధి ఫోన్‌ చేసి వీసాకు సంబంధించిన పత్రాలను గుడ్‌ విల్‌ సర్వీస్‌ ద్వారా ఢిల్లీకి పంపించామని, విమానాశ్రయంలోని కస్టమ్స్‌ అధికారుల ఆధీనంలో ఉన్నాయని నమ్మబలికారు.

Nigerian held for duping Hyderabad woman

అంతేగాక, కస్టమ్స్‌ అధికారులు వాటికి రూ.65వేలు ఛార్జీ వేశారని, ఆ డబ్బు చెల్లించాలని సూచించారు. బాధితురాలు మోసపోయినట్లు గ్రహించి సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐలు విజయవర్ధన్‌, శ్రీసివాస్‌ల బృందం ఢిల్లీకి వెళ్లి మాలవీయ నగర్‌లో ఉంటున్న నిందితుడు షిడిబెర్‌ విన్సెంట్‌(37) అదుపులోకి తీసుకున్నారు.

అతడితోపాటు మరో ఆరుగురు నకిలీ మెయిల్స్‌ పంపించి మోసగిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. బాధితురాలి నుంచి నిందితులు జమ చేసుకున్న బ్యాంకు ఖాతా నంబర్లలో జరిగిన లావా దేవీల వివరాలు సేకరించారు. నిందితుడి నుంచి ఐదు సెల్‌ఫోన్లు, 110 సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. కేసుపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

English summary
The cyber crime detectives of the Cyberabad police on Friday arrested a Nigerian national for cheating a city resident of lakhs of rupees under the pretext of providing her a job.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X