నిమ్స్ లో త్వరలో ఆత్యాధునిక క్యాన్సర్ లిక్విడ్ బయాప్సి.. ఉచిత సేవలు!

హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రి నిమ్స్‌లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్సలో కీలక మార్పు వస్తోంది. త్వరలోనే లిక్విడ్ బయాప్సీ అనే అత్యాధునిక పరీక్ష అందుబాటులోకి వస్తుంది. ఈ సేవతో రోగులు శరీరంలోకి బయాప్సీ సూదులు చొప్పించకుండానే, కేవలం ఒక్క చుక్క రక్తం ద్వారా క్యాన్సర్‌ను సులభంగా గుర్తించవచ్చు.

డైమండ్ ప్రాజెక్టు కింద నిమ్స్ లో క్యాన్సర్ కోసం అధునాతన వైద్య సేవలు

క్యాన్సర్ రోగులకు గొప్ప ఉపశమనం ఇచ్చే వార్తను నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ (NGS) సాంకేతికత ద్వారా క్యాన్సర్ జన్యు మార్పులను గుర్తించి టార్గెటెడ్ థెరపీ అందించడం జరుగుతోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని డైమండ్ ప్రాజెక్టు కింద ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని, 2024 నుంచి 1,443 మంది రోగులకు ఉచితంగా NGS పరీక్షలు చేశామని వెల్లడించారు.

NIMS Hyderabad is set to introduce Liquid Biopsy services cancer detection through a blood test

నిమ్స్ లో లిక్విడ్ బయాప్సీ సేవలు

లిక్విడ్ బయాప్సీలో సాంప్రదాయ బయాప్సీలాగా కణితి కణజాలాన్ని సేకరించాల్సిన అవసరం ఉండదు. రక్తంలోని సర్క్యులేటింగ్ ట్యూమర్ డీఎన్‌ఏ (ctDNA) ద్వారా క్యాన్సర్ స్థాయి, రకం మరియు చికిత్సకు అనువైన మందులను నిర్ధారించవచ్చు. ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్లు, ఎముకల్లో వ్యాపించిన క్యాన్సర్ వంటి కేసుల్లో ఈ పరీక్ష ఎంతో ఉపయోగపడుతుంది. ఇలాంటి క్యాన్సర్లలో సాధారణ బయాప్సీ చేయడం కష్టం కావడం వల్ల లిక్విడ్ బయాప్సీ ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది.

ఆరోగ్య శ్రీ క్రింద రోగులకు ఉచిత పరీక్షలు

నిమ్స్ పాథాలజీ విభాగాధిపతి డాక్టర్ శాంతవీర్ జి. ఉప్పిన్ మాట్లాడుతూ, ఈ అత్యాధునిక సాంకేతికత రోగులకు తక్కువ ఇబ్బంది కలిగించి, వేగంగా ఫలితాలు ఇస్తుందని వివరించారు. ఆరోగ్యశ్రీ కింద ఈ పరీక్షలు రోగులందరికీ ఉచితంగా అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నిమ్స్ ఇప్పటికే క్యాన్సర్ జీనోమిక్స్ సెంటర్‌ను ఏర్పాటు చేసి, అనేక అధునాతన సేవలను అందిస్తోంది.

సూపర్ న్యూస్.. సబర్బన్, ఎంఎంటీఎస్ రైల్వే ప్రయాణికులకు మెట్రో రేంజ్ సౌకర్యాలు!
సూపర్ న్యూస్.. సబర్బన్, ఎంఎంటీఎస్ రైల్వే ప్రయాణికులకు మెట్రో రేంజ్ సౌకర్యాలు!

కొత్త సేవల ద్వారా రాష్ట్రంలో క్యాన్సర్ చికిత్సలో పురోగతి

లిక్విడ్ బయాప్సీ రావడంతో తెలంగాణలో క్యాన్సర్ రోగులకు మరింత మంచి చికిత్సలు అందుబాటులోకి వస్తాయి. ఈ సాంకేతికత వల్ల రోగ నిర్ధారణ త్వరగా జరిగి, సకాలంలో చికిత్స ప్రారంభించవచ్చు. దీంతో రోగుల జీవన నాణ్యత మెరుగుపడుతుంది. నిమ్స్ అధికారులు ఈ కొత్త సేవల ద్వారా రాష్ట్రంలో క్యాన్సర్ చికిత్సలో మైలురాయి సాధించాలని భావిస్తున్నారు. ఇప్పటికే NGS సాంకేతికతతో మంచి ఫలితాలు వచ్చాయని, లిక్విడ్ బయాప్సీతో మరింత ముందుకు వెళ్లాలని ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+