బాధపడుతున్నా: కాళేశ్వరం ప్రాజెక్టుపై నితిన్‌ గడ్కరీ కీలక వ్యాఖ్యలు

కామారెడ్డి: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ తేదీ సమీపిస్తున్న వేళ బీజేపీ కీలక నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. సోమవారం కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో సకల జనుల విజయసంకల్ప సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా అధికార బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు.తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందని.. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చామని.. అందుకు ఇవాళ బాధపడుతున్నట్లు నితిన్ గడ్కరీ (Nitin Gadkari) ఆవేదన వ్యక్తం చేశారు.

కేసీఆర్​ సొంత డిజైన్‌తో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి.. రూ.లక్ష కోట్లు వృథా చేశారంటూ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తే.. మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. తెలంగాణలో జాతీయ రహదారులను వేల కోట్లు ఖర్చుచేసి నిర్మించామని తెలిపారు.

 Nitin Gadkari slams BRS Government for kaleshwaram project corruption issue

అన్ని వర్గాలకు.. సకలజనులకు సమాన న్యాయం జరగాలంటే.. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలన్నారు గడ్కరీ ఆకాంక్షించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే అభివృద్ధి హైవేపై ప్రయాణంలా దూసుకుపోతుందని చెప్పారు. తెలంగాణలో బీజేపీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని నితిన్ గడ్కరీ రాష్ట్ర ప్రజలను కోరారు.

ఉప్పల్‌లో అమిత్ షా రోడ్ షో: బీజేపీ శ్రేణుల్లో జోష్

ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందురు రాష్ట్రానికి వచ్చిన బీజేపీ అగ్రనేత అమిత్ షా(Amit Shah) హైదరాబాద్​ ఉప్పల్​‌లో రోడ్ షో నిర్వహించారు. అంతకుముందు జనగామ, మెట్‌పల్లిలో సకల జనుల విజయ సంకల్ప సభల్లో పాల్గొన్నారు అమిత్‌. అనంతరం సోమవారం సాయంత్రం ఉప్పల్‌ నియోజకవర్గంలో రోడ్​ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ(BJP) అభ్యర్థి ఎన్​వీఎస్​ఎస్​ ప్రభాకర్‌కు మద్దతుగా అమిత్​ షా ప్రచారం చేశారు.

రోడ్ షోలో అమిత్​ షా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. రోడ్ షోలో బీజేపీ శ్రేణులు, ప్రజలు అమిత్​ షాను చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బీజేపీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో నృత్యాలు చేస్తూ.. సందడిగా ముందుకు సాగారు. దీంతో ఆ ప్రాంతంలో కాసేపు ట్రాఫిక్‌​కు అంతరాయం కలిగింది. ఈ రోడ్​ షోలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో బీజేపీని గెలిపించాలని కోరారు. డబుల్ సర్కార్ వల్ల లాభాలను అమిత్ షా ఓటర్లకు వివరించారు. బీజేపీని గెలిపిస్తేనే.. తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+