భార్య ఇక్కడ.. భర్త దుబాయిలో.. పన్నెండేళ్ల తరువాత తెలిసిందో నిజం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: కుటుంబాన్ని పోషించుకునేందుకు దుబాయికి వెళుతున్న భర్త శంకర్‌ను భారమైన హృదయంతో సాగనంపుతున్నప్పుడు భార్య భూదేవి నిండుగర్భిణి! ఆమెకు కొడుకు పుట్టాడు.. 12 ఏళ్ల ప్రాయానికొచ్చాడు.

కానీ దుబాయికి వెళ్లిన శంకర్‌ మళ్లీ తిరిగిరాలేదు. ఓ హత్య కేసులో చేయని నేరానికి తొమ్మిదేళ్లుగా అక్కడి జైల్లో మగ్గుతున్నాడు. కట్టుకున్నవాడు దగ్గర లేకున్నా.. ఎక్కడో ఒకచోట బతికే ఉన్నాడనుకుంటున్న భూదేవికి ఆ వార్త అశనిపాతమే అయింది. నెలరోజుల్లో బాధిత కుటుంబానికి రూ.6.5 లక్షలు చెల్లించకుంటే, అతడికి మరణశిక్ష తప్పదని తెలియడంతో భూదేవి కన్నీరుమున్నీరవుతోంది.

ప్రభుత్వం, దాతలు స్పందించి తన భర్తకు ప్రాణభిక్ష పెట్టాలని విజ్ఞప్తి చేస్తోంది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కుమారుడు రాజుతో కలిసి భూదేవి తన గోడు వెళ్లబోసుకుంది.

Nizamabad Man In Dubai Prison since 8 Years, Wife trying to release him with the help of helping hands

అసలు కథేమిటంటే...

నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలం మెండోరా గ్రామానికి చెందిన మాకూరి శంకర్‌ ఓ వ్యవసాయ కూలీ. ఉపాధి కోసం 2005 లో దుబాయి వెళ్లి, ఓ కంపెనీలో ఫోర్ మన్ గా చేరాడు. ఒకరోజు అతనితో పాటు పని చేస్తున్న రాజస్థాన్ కు చెందిన రామావతార్ కుమావత్ ప్రమాదవశాత్తు ఆరో అంతస్తు నుంచి కింద పడి చనిపోయాడు.

అయితే రామావతార్‌ మృతికి శంకరే కారణమంటూ అతనిపై హత్య కేసు నమోదు చేసి, జైల్లో పెట్టారు. 2009 నుంచి దుబాయిలోని పుజిర జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు శంకర్. దుబాయి చట్టాల ప్రకారం హత్య చేసిన వారికి మరణశిక్ష విధిస్తారు. మృతుడి బంధువులు కనుక క్షమాభిక్ష పెడితే విడుదల చేస్తారు.

దీంతో శంకర్‌ భార్య, కుమారుడు అతని విడుదల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఆర్మూర్‌ మండలం దేగాం గ్రామానికి చెందిన దేగాం యాదాగౌడ్‌ సాయాన్ని అర్థించారు. అతను పలుమార్లు రాజస్థాన్‌కు వెళ్లి మృతుడు రామవతార్‌ కుటుంబ సభ్యులను కలిశారు.

చివరికి రూ.6.50లక్షలు చెల్లిస్తే క్షమాభిక్ష లేఖ ఇస్తామని వారు చెప్పడంతో ఆ డబ్బు కోసం శంకర్‌ భార్య ప్రయత్నిస్తోంది. నెల రోజుల్లోగా డబ్బులు చెల్లిస్తే.. శంకర్‌ ప్రాణాపాయం నుంచి తప్పించుకుంటాడని, దాతలు స్పందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది.

లక్ష్మీప్రసన్న స్టీల్ రెయిలింగ్ వర్క్స్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, ఆర్మూర్ బ్రాంచి, ఐఎఫ్ఎస్ సి కోడ్ ఎస్ బిహెచ్ వై0 ఆర్ఆర్ డిసిజిబి, అకౌంట్ నంబరు 79039814635లో జమ చేయవచ్చని కోరారు. వివరాలకు దేగం యూదాగౌడ్ ను 9848248894 నంబరులో సంప్రదించవచ్చని సూచించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Nizamabad man who is suffering in a prision at Dubai since 8 years. His name is Makuri Shankar of mendora village, balkonda mandal of Nizamabad District. He went to dubai 12 years back and joined in a company as foreman. Unfortunately he was arrested in a murder case and got death impresionment from a dubai court. His wife, and her son are now trying to release him with the help of helping hands.
Please Wait while comments are loading...