మోత్కుపల్లి: రేవంత్‌కు చెక్‌ కోసమే టిఆర్ఎస్ పొత్తు, ఒంటరి పోరేనా?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: 2019 ఎన్నికల్లో టిడిపి ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ సీనియర్‌నేత మోత్కుపల్లి నర్సింహులు స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి ఎపిసోడ్ సమయంలో టిఆర్ఎస్‌తో టిడిపి పొత్తు పెట్టుకొంటుందని మోత్కుపల్లి ప్రకటించారు. అయితే వ్యూహత్మకంగానే మోత్కుపల్లి ఆ సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారా అనే చర్చ సర్వత్రా సాగుతోంది.

రేవంత్‌కు మోత్కుపల్లి షాక్: 'మురికిపోయింది, ప్రజలే బుద్ది చెబుతారు'

2019 ఎన్నికల్లో టిడిపి టిఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకొంటుందని మోత్కుపల్లి నర్సింహ్ములు రేవంత్‌రెడ్డి ఎపిసోడ్ సమయంలో ప్రకటించారు. అయితే టిఆర్ఎస్‌తో పొత్తు విషయమై రేవంత్ రెడ్డి తీవ్రంగా విబేధించారు. ఈ అంశాన్ని సాకుగా చూపి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

రేవంత్ ఎఫెక్ట్: పెరుగుతున్న వలసలు, దిద్దుబాటలో టిడిపి

అయితే పొత్తుల అంశాన్ని టిడిపి నేతలు వ్యూహత్మంగానే తెరమీదికి తీసుకువచ్చి మీడియాలో మాట్లాడడం వల్లే రేవంత్‌రెడ్డి ఎపిసోడ్ బహిర్గతమైందని ఆ పార్టీ నేతలు కొందరు చెబుతున్నారు. తమ వ్యూహంలో భాగంగానే రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాల్సి వచ్చిందనే టిడిపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ ఇటీవల చేసిన ప్రకటన కూడ ఈ అంశానికి బలాన్ని చేకూరుస్తోంది.

కాంగ్రెస్‌కు 70 సీట్లు, రేవంత్‌కు ప్రచారం, గుత్తాకు చెక్‌కే కంచర్ల: కోమటిరెడ్డి సంచలనం

2019 ఎన్నికల్లో టిడిపి ఒంటరి పోరాటం

2019 ఎన్నికల్లో టిడిపి ఒంటరి పోరాటం

2019 ఎన్నికల్లో టిడిపి ఒంటరిగానే పోటీ చేస్తోందని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహ్ములు ప్రకటించారు.అయితే వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్‌తో పొత్తు ఉంటుందని మోత్కుపల్లి నర్సింహ్ములు రేవంత్‌రెడ్డి ఎపిసోడ్ సమయంలో ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ కంటే టిఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోవడం వల్లే ప్రయోజనమని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ, శనివారం నాడు మాత్రం మోత్కుపల్లి ఒంటరిగానే టిడిపి పోటీ చేస్తుందని ప్రకటించడం సంచలనం సృష్టించింది.

వ్యూహత్మకంగానే పొత్తుల అంశం తెచ్చారా

వ్యూహత్మకంగానే పొత్తుల అంశం తెచ్చారా

రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే ప్రతిపాదించారు. అయితే కాంగ్రెస్‌ పార్టీతో పొత్తును టిడిపి నేతలు మాత్రం వ్యతిరేకించారు. గవర్నర్ పదవి రాలేదన్న సమయంలో మీడియాతో మాట్లాడిన మోత్కుపల్లి నర్సింహ్ములు కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండదన్నారు. టిడిపి సిద్దాంతానికి అది వ్యతిరేకమన్నారు. అంతేకాదు అదే సమయంలో టిఆర్ఎస్‌తో పొత్తు అవకాశాన్ని కొట్టిపారేయలేమని తేల్చి చెప్పారు. ఈ విషయమై పార్టీ అధినేత వద్ద నేతలు చర్చించారు. పొత్తుల గురించి ఎవరూ మాట్లాడకూడదని చంద్రబాబు తేల్చి చెప్పారు.కానీ, టిఆర్ఎస్‌తో పొత్తు విషయమై కొందరు నేతలు ఆ సమయంలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి.అయితే కొందరు టిడిపి నేతలు వ్యూహత్మకంగానే ఈ అంశాన్ని తెరమీదికి తెచ్చారనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

రేవంత్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి కల్పించాం

రేవంత్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి కల్పించాం


రేవంత్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేసిన మరునాడు అమరావతి కేంద్రంగా టిడిపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. తాము వేసిన వ్యూహంతో రేవంత్‌ రెడ్డి రాజీనామా చేయాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. ఈ విషయమై రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే విషయమై ముందే సమాచారం ఉన్న టిడిపి నేతలు పొత్తుల అంశంపై మాట్లాడించారనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

2019 లో టిడిపి వ్యూహమేమిటీ?

2019 లో టిడిపి వ్యూహమేమిటీ?

2019 ఎన్నికల్లో టిడిపి ఒంటరిగా పోటీ చేస్తోందని ఆ పార్టీ నేతలు ఇప్పుడు ప్రకటిస్తున్నారు. అయితే ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. అయితే టిడిపితో పొత్తు పెట్టుకొంటే రాజకీయంగా టిఆర్ఎస్‌కు కూడ కలిసివచ్చే అవకాశం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహన్ని తనకు వదిలేయాలని ఆ పార్టీ చీఫ్ చంద్రబాబునాయుడు ప్రకటించారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో టిడిపి ఒంటరిగా పోటీచేస్తే తెలంగాణలో ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. కానీ, ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకొంటే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TTDP senior leader motkupalli Narasimhulu said that No alliance with any party in 2019 elections.He spoke to media at Nalgodna on Saturday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి