2019లో ఒంటరి పోరే, 50 శాతం రిజర్వేషన్లు సరిపోవు, నా పిల్లల్ని ప్రజలు గెలిపించారు: కెసిఆర్

హైదరాబాద్: 2019 ఎన్నికల్లో ఏ పార్టీతో కలిసి పోటీ చేయబోమని తెలంగాణ సీఎం కెసిఆర్ కుండబద్దలు కొట్టారు. ఆ అవసరమే తమకు తెలంగాణలో లేదని కెసిఆర్ చెప్పారు. ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు. వ్యవసాయరంగంలో తమ రాష్ట్రం దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటుందని తెలంగాణ సీఎం కెసిఆర్ అభిప్రాయపడ్డారు. నీటిపారుదల రంగంలో అద్భుతాలు చేస్తున్నట్టు చెప్పారు. తాము చేపడుతున్న విధానాల వల్ల రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని కెసిఆర్ చెప్పారు.

ఇండియా టూడే నిర్వహించిన కాంక్లేవ్‌లో కెసిఆర్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలు విషయాలపై ఆయన స్పందించారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఏ రకంగా అణచివేతకు గురైంది, తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా అభివృద్దిలో ముందుకు సాగుతున్న విషయాన్ని కెసిఆర్ ప్రస్తావించారు.

రాష్ట్ర ప్రయోజనాలే తనకు ప్రయోజనమని కెసిఆర్ చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాను పనిచేస్తానని కెసిఆర్ చెప్పారు. అనతికాలంలోనే రాష్ట్రాన్ని అభివృద్ది పథంలోకి తీసుకెళ్తున్నట్టు కెసిఆర్ చెప్పారు.

ఏ పార్టీతో కలిసి పోటీ చేయం

ఏ పార్టీతో కలిసి పోటీ చేయం

2019 ఎన్నికల్లో తాము ఏ పార్టీతో కలిసి పోటీ చేయబోమని తెలంగాణ సీఎం కెసిఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో తమకు ఆ అవసరం లేదని చెప్పారు. ఒంటరిగానే పోటీ చేస్తామని ఆయన చెప్పారు. ఏ పార్టీతో పొత్తుల అవసరం లేదని ఆయన చెప్పారు.

రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం

రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం

తనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని తెలంగాణ సీఎం కెసిఆర్ చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అహర్నిశలు చేసుకొంటామని చెప్పారు. ఆయా రాష్ట్రాల పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్లు ఉండాలని కెసిఆర్ అభిప్రాయపడ్డారు. 50 శాతం రిజర్వేషన్లు సరిపోవన్నారు. ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగానే రిజర్వేషన్లు ఉండాల్సిన అవసరం ఉందన్నారు కెసిఆర్. ఈ మేరకు తమిళనాడు, మహరాష్ట్రలో మాదిరిగానే తెలంగాణలో కూడ రిజర్వేషన్లను పెంచాలని కోరుతున్నామని కెసిఆర్ చెప్పారు.

నా పిల్లలు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు

నా పిల్లలు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు

తెలంగాణ ఉద్యమంలో తనతో పాటు తన కుటుంబ సభ్యులు పాల్గొన్నారని చెప్పారు. తాను తన కుటుంబసభ్యులకు నామినేట్ పదవులు కట్టబెట్టలేదని కెసిఆర్ చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో తన కుటుంబసభ్యులు పాల్గొన్నారని చెప్పారు. ఆ సమయంలో అనేక కేసులు ఎదుర్కొంటున్నట్టు ఆయన చెప్పారు. ప్రజల చేత వారు ఎన్నుకొన్నందునే ప్రజాప్రతినిధులుగా ఉన్నారని కెసిఆర్ చెప్పారు.తెలంగాణ ప్రజలే తన ఫ్యామిలీ అని కెసిఆర్ చెప్పారు.

2020 నాటికి 28 వేల మెగావాట్ల విద్యుత్

2020 నాటికి 28 వేల మెగావాట్ల విద్యుత్

2020 నాటికి తెలంగాణ రాష్ట్రంలో 28 వేల మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకొంటారని ఆయన చెప్పారు. అయితే అదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఆరు మాసాల్లోనే విద్యుత్ ఉత్పత్తిలో ఎంతో ప్రగతి సాధించినట్టు కెసిఆర్ చెప్పారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే సమయానికి తెలంగాణలో కేవలం 6 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగేదన్నారు. ఆరు మాసాల తర్వాత 14 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి చేరుకొంటున్నట్టు చెప్పారు.

ఏపీతో పోలీకే లేదు

ఏపీతో పోలీకే లేదు

తమ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే ముందున్నామని తెలంగాణ సీఎం కెసిఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏపీ రాష్ట్రం కంటే ముందుందని కెసిఆర్ చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య చాలా వ్యత్యాసం ఉందని కెసిఆర్ అభిప్రాయపడ్డారు.ఏపీ రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాల కంటే తామేమీ తీసిపోమని కెసిఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఇతర మిగులు రాష్ట్రంగా ఉందన్నారు. ఆర్థికంగా తెలంగాణను మరింత బలోపేతం చేస్తామని కెసిఆర్ ప్రకటించారు.

దేశ రాజకీయాల్లోకి రాను

దేశ రాజకీయాల్లోకి రాను

దేశ రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి తనకు లేదని కెసిఆర్ ప్రకటించారు. తెలంగాణను అభివృద్ది చేయడమే తన ముందున్న లక్ష్యమని ఆయన చెప్పారు. తెలంగాణ చిన్న రాష్ట్రం కాదన్నారు. భౌగోళికంగా బీహర్, బెంగాల్ రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రం పెద్దదని కెసిఆర్ చ��ప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+