కారు పోయింది సర్వీసుకే.. షెడ్డుకు కాదు!: బీజేపీతో పొత్తుపై కేటీఆర్ క్లారిటీ

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమను ఓడించి తెలంగాణ ప్రజలు తప్పుచేసినట్లు కొందరు నేతలు వ్యాఖ్యానించడం సరికాదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో జరిగిన భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. గత రెండు ఎన్నికల్లోనూ తెలంగాణ ప్రజలే మనకు పట్టం కట్టారని గుర్తుంచుకోవాలన్నారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు పూర్తిగా వ్యతిరేకించలేదన్నారు.

కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన కొంతమంది పెద్ద మనుషులు కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి కాలేదని ప్రశ్నిస్తున్నారని కేటీఆర్ చెప్పారు. ఖచ్చితంగా గెలుస్తామనుకున్న జిల్లాల్లో విభిన్న ఫలితాలు రావడం నిరాశపరిచిందని.. కేవలం వందలు, వేలల్లో ఓటమి పాలైన స్థానాల్లో పార్టీ గెలిచి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. పార్టీ ఓటమికి తొమ్మిది కారణాలు ప్రధానంగా సన్నాహక సమావేశాల్లో వస్తున్నాయన్నారు.

 NO alliance with BJP, in future also: KTR responded on BRS assembly elections lost

అధికారంలో ఉన్నప్పుడు పార్టీని పట్టించుకోలేదని.. ఇందుకు తనదే పూర్తి బాధ్యత అని కేటీఆర్ అంగీకరించారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే కేంద్రంగా పార్టీని నడపడం సరికాదన్నారు. పదేళ్లలో పార్టీ కార్యకర్తల ఆర్థిక పరిస్థితిని పట్టించుకోలేదని పలువురు తెలిపినట్లు ఆయన చెప్పారు. ఇక నుంచి పార్టీ చుట్టే ఎమ్మెల్యేలు తిరగాల్సి ఉంటుందన్నారు. దళితబంధు కొందరికే రావడంతో మిగతా వారు వ్యతిరేకమయ్యారని, ఇతర కులాల్లో కూడా వ్యతిరేకత వచ్చిందని వివరించారు.

రైతుబంధు తీసుకున్న సామాన్య రైతు కూడా ఎక్కువ ఎకరాలున్న భూస్వామికి వస్తే ఒప్పుకోలేదన్నారు. వీటితో పాటు ఇంకా కొన్ని కారణాలున్నాయన్నారు. పథకాల ద్వారా భవిష్యత్తులో తలెత్తే సమస్యలను సరిగ్గా అంచనా వేయలేకపోయామన్నారు. రోజువారీ అభిప్రాయాలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌​కు నివేదిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ తయారు చేసిన జగదీశ్ ​రెడ్డి, తదితర తమలాంటి కార్యకర్తలే అసెంబ్లీలో దీటుగా తిప్పికొడితే.. త్వరలో స్వయంగా కేసీఆర్ అసెంబ్లీకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేరని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

 NO alliance with BJP, in future also: KTR responded on BRS assembly elections lost

రైతుబంధు లేక, కరెంటు కోతలతో ఇప్పటికే గ్రామాల్లో ప్రజలు అసహనంతో ఉన్నారని కేటీఆర్ తెలిపారు. సరైన సంఖ్యలో బస్సులు లేక మహిళలు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మరోవైపు, ఉచిత బస్సు పథకంతో ఆటోడ్రైవర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పుకొచ్చారు. తక్షణమే ఇరువర్గాల సమస్యలకు పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు గతంలో లేదని.. భవిష్యత్‌లోనూ ఉండబోదని కేటీఆర్ స్పష్టం చేశారు. పదేళ్ల పాటు విరామం ఎరుగక పనిచేసిన కారు మరింత స్పీడుగా పనిచేసేందుకు సర్వీసింగ్‌​కు పోయిందే తప్ప.. షెడ్డులోకి పోలేదని కేటీఆర్ చమత్కరించారు. రాబోయే లోక్‌​సభ ఎన్నికల్లో జయకేతనం ఎగరేయడం ద్వారా ఆ తర్వాత వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్​ కార్యకర్తలు నేతలు తమ సత్తా చాటాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రజలకు చేసిన మోసపూరిత వాగ్ధానాలపై తెలియజేయాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+